ఈనెల 31న విడుదల కాబోతున్న ‘అశ్వద్ధామ’కు మరో సెంట్రాఫ్ అట్రాక్షన్ చేరింది. ఈ సినిమా పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్‌తో మొదలు కానుంది. భారతంలో అశ్వద్ధామని పరిచయం చేస్తూ.. పవన్ చెప్పిన పలుకులు సినిమా ప్రారంభంలోనే వినిపించనున్నాయి. అయితే ఈ సినిమా కోసం పవన్ వాయిస్ ఓవర్ ఏమీ చెప్పలేదు. `గోపాల గోపాల`లో అశ్వద్ధామ గురించి పవన్ చెప్పిన డైలాగే.. ఇక్కడ వాడనున్నారు. అయితే అందుకు సంబంధించిన అనుమతుల్ని నిర్మాత శరత్ మరార్ నుంచి తీసుకుంది చిత్రబృందం. సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్ని, అన్యాయాల్ని ప్రశ్నించే పాత్రలో నాగశౌర్య కనిపించబోతున్నాడు. అశ్వద్ధామది కూడా ప్రశ్నించే తత్వమే. అందుకే ఈ సినిమాకి ఆ పేరు పెట్టారు. `గోపాల గోపాల`లో పవన్ కల్యాణ్ కూడా అశ్వద్ధామ ప్రశ్నించే తత్వాన్ని మెచ్చుకుంటూ సంభాషణలు చెప్పాడు. అది ఈ సినిమాకి ఇలా ఉపయోగపడుతోంది. మొత్తానికి పవన్ మాటలు ఈ సినిమాలో వినిపించబోతున్నాయన్నమాట. ఇప్పటికే విన్న డైలాగ్ అయినా – ఈ సినిమాకి అది కచ్చితంగా సెంట్రాఫ్ ఎట్రాక్షన్ కాబోతోంది.