గోపాలకృష్ణ ద్వివేదీ జగన్ హయాంలో ఎన్ని సార్లు కోర్టు శిక్షలకు గురయ్యారో చెప్పాల్సిన పని లేదు. అంతగా తాను ప్రమాణం చేసి సర్వీసులోకి వచ్చిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన తన సర్వీస్ కాలాన్ని కూడా పణంగా పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయన చేసిన పని డిస్మిస్ చేయడానికి సరిపోయేదే. అయితే చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూడా ఆయనకు మంచి పోస్టింగ్ ఇచ్చారు.
కానీ చంద్రబాబులా అంతా మంచి వాళ్లు కాదు. ఆయన తీరును సోషల్ మీడియాలో తీవ్రంగా నిరసించారు. ఫలితంగా ఆయనను కీలక బాధ్యతల నుంచి తప్పించాల్సి వచ్చింది. అయినా ఆయన ప్రభుత్వంలో భాగం అయితే.. అదో సిగ్గుమాలినతనంగా ఉంటుందన్న విమర్శలు రావడంతో ఆయనను తాజాగా జీఏడీకి అటాచ్ చేస్తూ.. అన్ని బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. భవిష్యత్లో పోస్టింగ్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు కానీ సీఎస్ కానీ ఆలోచించేలా గత ప్రభుత్వంలో వ్యవహరంచారు.
జగన్ రెడ్డి క్రిమినల్ కుట్రల్లో ఎంతో మంది సివిల్ సర్వీస్ ఆధికారులు పాలుపంచుకున్నారు. ఆ కుట్రలన్నీ టీడీపీ, చంద్రబాబును టార్గెట్ చేసినవే. తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వడం.. తప్పుడు ప్రకటనలు చేయడం… సమాచారాన్ని దాచి పెట్టడం సహా ఎన్నో కుట్రలున్నాయి. స్వయంగా తనను కేసుల్లో ఇరికించడానికి తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చిన వారినీ చంద్రబాబు ఏమనలేకపోతున్నారు. తమ మెడపై కత్తి పెట్టి అతి చెప్పించారని వారంటే కరిగిపోతున్నారు. కానీ వారికి బయట నుంచి మాత్రం మద్దతు రావడం లేదు. అందుకే చంద్రబాబు వారిని నిరాశపర్చలేదు. మొహమాటాలు పక్కన పెట్టి అలాంటి అధికారుల్ని దూరం పెట్టి… అసలు కేసులపై విచారమ జరిపి… వారిపై కేసులు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.