ఇది వరకు యాక్షన్ సినిమాలంటే ఓటీటీలు, శాటిలైట్ ఛానళ్లు, హిందీ డబ్బింగ్ రైట్స్.. అన్నీ మంచి రేట్లకు అమ్ముడుపోయేవి. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. స్టార్ హీరో సినిమాల్నీ లైట్ తీసుకొంటున్నారు. రవితేజ ‘ఈగిల్’కి ఇదే సమస్య వచ్చింది. సాధారణంగా రవితేజ సినిమా అంటే ఓటీటీ హాట్ కేక్. కానీ ‘ఈగిల్’ మాత్రం షేరింగ్ పద్ధతిలో విడుదల చేసుకోవాల్సివచ్చింది. ఇప్పుడు గోపీచంద్ సినిమాకీ అదే ప్లాబ్లెమ్.
గోపీచంద్ కథానాయకుడిగా రూపుదిద్దుకొన్న సినిమా ‘భీమా’. మంచి యాక్షన్ ప్యాక్డ్ సినిమా ఇది. గోపీచంద్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. రేపే విడుదల. సాధారణంగా గోపీచంద్ సినిమాలకు నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మంచి సొమ్మే గిట్టుబాటు అవుతుంది. అయితే.. ‘భీమా’ వ్యవహారం మాత్రం అలా లేదు. ఓటీటీ, శాటిలైట్ రేట్లు ఎప్పుడో పడిపోయాయి. దానికి తోడు గోపీచంద్ కి వరుస ఫ్లాపులు వచ్చాయి. దాంతో ఈ సినిమాని కూడా షేర్ పద్ధతిలో ఓటీటీకి ఇచ్చేశారని తెలుస్తోంది. ఓటీటీలో ఎంతమంది చూస్తే.. అన్ని డబ్బులన్నమాట. పే ఫర్ వ్యూ టైపు. సాధారణంగా చిన్న సినిమాల్ని ఇలా పే ఫర్ వ్యూ పద్ధతిలో ఓటీటీ సంస్థలు తీసుకొంటుంటాయి. ఇప్పుడు మీడియం రేంజు సినిమాలూ అదే జాబితాలో చేరిపోయాయి.