ఎండలు దంచేస్తుంటే… వేసవి కాలంలో వర్షాలేంటి? అనే అనుమానం రావొచ్చు. హైదరాబాద్‌లో ఎండలు హీటెక్కిస్తున్నాయి. కానీ, విదేశాల్లో మాత్రం వర్షాలు కురుస్తున్నాయ్. మొన్నటికి మొన్న బ్యాంకాక్‌లో రామ్‌చరణ్‌కి వరుణుడు కాసేపు బ్రేక్ ఇచ్చాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా షూటింగ్ వర్షం వల్ల ఒక రోజు క్యాన్సిల్ అయ్యిందట! ఈ రోజు లండన్‌లో గోపీచంద్‌కీ వరుణుడు అడ్డొచ్చాడు. ఆయన హీరోగా కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న సినిమా ‘పంతం’. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాతో కె. చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గోపీసుందర్ సంగీతమందించిన ఈ సినిమాలోని మూడు పాటల చిత్రీకరణ కోసం టీమ్ అంతా యూరప్ వెళ్ళింది. అయితే.. ఈ రోజు కొంత పార్ట్ షూట్ చేశాక, వర్షం పడింది. దాంతో చేసేది ఏమీ లేక వర్షం ఎప్పుడు తగ్గుతుందా? అని యూనిట్ సభ్యులు అందరూ వెయిట్ చేస్తున్నారు.