గోపీచంద్‌ది యాక్షన్ ఇమేజ్. దానికి కొంచెం ఎంటర్టైన్మెంట్ జోడించిన సినిమలన్నీ హిట్టయ్యాయి. రణం, లక్ష్యం, లౌక్యం.. ఇవన్నీ ఈ ఫార్ములాతో వచ్చిన సినిమలే. అయితే గత కొన్నేళ్లుగా ఈ జోనర్ కూడా వర్కవుట్ కావడం లేదు. అందుకే వరుసగా ఫ్లాపులు కొని తెచ్చుకున్నాడు. ఈసారి యాక్షన్‌కి ఓ సోషల్ మెసేజ్ జోడించి `పంతం` రూపంలో తీసుకొస్తున్నాడు. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి చక్రి దర్శకుడు. టీజర్ ఇప్పుడు విడుదలైంది. స్టైలీష్ యాక్షన్ సినిమాగా `పంతం`ని తీర్చిదిద్దినట్టు అర్థమవుతోంది. ఫృథ్వీ, శ్రీనివాసరెడ్డిలు ఉన్నారు కాబట్టి – ఎంటర్టైన్మెంట్ని కూడా కొద్దో గొప్పో ఆశించొచ్చు. కోర్టు సీన్లో గోపీచంద్ చెబుతున్న నాన్ స్టాప్ డైలాగ్ వింటే… ఈ సినిమా కరెప్షన్‌పై కూడా ఫోకస్ చేసిందని అర్థమవుతోంది. కమర్షియల్ సినిమాకి కావల్సిన అన్ని లక్షణాలూ ‘పంతం’లో కనిపిస్తున్నాయి. గోపీచంద్ నుంచి వస్తున్న 25వ సినిమా ఇది. ఇదైనా… గోపీచంద్ పరాజయాల పరంపరకు బ్రేక్ వేస్తుందేమో చూడాలి.