గోపీచంద్, సంపత్నందిలది విజయవంతమైన కాంబినేషన్. ‘గౌతమ్‌నంద’, ‘సిటీమార్’ సినిమాలు వీరిద్దరి నుంచి వచ్చాయి. ‘గౌతమ్‌నంద’ థీమ్ బాగుంటుంది. గోపీచంద్ క్లాసీగా కనిపించాడు. `సిటీమార్` కమర్షియల్ గా ఓకే అనిపించుకొన్న సినిమా. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమయ్యారు. గోపీచంద్ – సంపత్‌నంది నుంచి ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది. ఇందుకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి.
ప్రస్తుతం సంపత్ నంది శర్వానంద్‌తో ఓ సినిమా తీస్తున్నారు. ఈనెలలోనే సెట్స్‌పైకి వెళ్తుంది. దీని తరవాత గోపీచంద్ సినిమా పట్టాలెక్కుతుంది. ఈలోగా గోపీచంద్ కూడా ఓ సినిమా పూర్తి చేస్తారు. శర్వాతో తీసే సినిమాపై సంపత్ పూర్తి ఫోకస్ తో ఉన్నారు. ఈ సినిమా కోసం నగర శివార్లలో ఓ భారీ సెట్ తీర్చిదిద్దారు. దాదాపు 70 శాతం షూటింగ్ ఈ సెట్లోనే జరుగుతుంది. హీరోయిన్, విలన్ పాత్రల ఎంపిక జరిగిపోయాయి. త్వరలోనే టైటిల్ తో పాటుగా మిగిలిన వివరాలు పంచుకోవడానికి చిత్రబృందం సమాయాత్తం అవుతోంది.