గోపీచంద్ – బి.గోపాల్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్థిక పరమైన కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. ఈ దీపావళికి ఫస్ట్ లుక్ విడుదల చేసి, టైటిల్‌నీ కన్ఫామ్ చేయాలని చిత్రబృందం భావించింది. ఈ సినిమా కోసం `బలం` అనే టైటిల్ పరిశీలించారు కూడా. అదే టైటిల్‌ని ఫిక్స్ చేస్తారనుకొంటే.. ఆ టైటిల్ ని హృతిక్ రోషన్ లాగేసుకొన్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ … “కాబిల్” . ఈ చిత్రాన్ని తెలుగు లోనూ విడుదల చేయనున్నారు. తెలుగు వెర్షన్‌కి బలం అనే టైటిల్ పెట్టారు.
సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26 2017 న విడుదల అవుతుంది. ట్రైలర్ ఈ దీపావళికి వస్తుంది.
బలం అనే టైటిల్ హృతిక్ తీసుకోవడంతో ఇప్పుడు గోపీచంద్ సినిమా కోసం మరో టైటిల్ వెదికే పనిలో ఉంది చిత్రబృందం. ఆరడుగుల బుల్లెట్, బుల్లెట్ అనే పేర్లు పరిశీలిస్తున్నారు. ఇవి కాక గోపీచంద్ సెంటిమెంట్ ప్రకారం సున్నాతో ముగిసే టైటిల్ కూడా అన్వేషిస్తున్నారు. దీపావళికి గోపీచంద్ కూడా టైటిల్ కన్ఫామ్ చేసే అవకాశాలున్నాయి. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.