గోపీచంద్ కెరీర్ మరీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందిప్పుడు. వరుస పరాజయాలు ఆయన కెరీర్‌ని డేంజర్ జోన్లో పడేశాయి. ఆమధ్య `భీమా` కాస్త ఊపిరిపోసింది. కానీ `విశ్వం`తో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం `జిల్` ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కథ రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ తెరకెక్కించాల్సివుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా చేతులు మారింది. ఇప్పుడు 70 ఎం.ఎం. ప్రొడక్షన్స్ చేతికి వచ్చినట్టు సమాచారం.
యూవీ క్రియేషన్స్ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తమ పెట్టుబడి అంతా `విశ్వంభర` పై పెట్టేశారు. సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. కానీ వాయిదా పడింది. దాంతో బిజినెస్ కూడా ఆగింది. అఖిల్ తో సినిమా అనుకొన్నారు కానీ, దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడం లేదు. కారణం.. విశ్వంభర బిజినెస్ అవ్వకపోవడమే. ఇప్పుడు గోపీచంద్ సినిమా కూడా ఈ కారణంతోనే పక్కన పెట్టేశారు. విశ్వంభర బిజినెస్ అయితే తప్ప యూవీకి పెట్టుబడి తిరిగి రాదు. అప్పటి వరకూ యూవీ నుంచి కొత్త సినిమాలేమీ ఉండకపోవొచ్చు. ప్రస్తుతం వరుణ్‌తేజ్ తో యూవీ ఓ సినిమా చేస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. అయితే ఈ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి చేస్తోంది. అది మినహా యూవీ నుంచి మరో సినిమా లేదు.