మూస చిత్రాలకు, మాస టైటిళ్లకూ కాలం చెల్లిపోయిన రోజులివి. కుర్ర హీరోలు సైతం ఏదో కొత్తగా ట్రై చేయడానికి తపన పడిపోతున్నారు. టైటిల్ దగ్గర నుంచి క్యారెక్టరైజేషన్ వరకూ ఏదో ఒకటి కొత్తగా చూపించాలని ఆరాటపడుతున్నారు. సీనియర్ హీరోలు మాత్రం ఇంకా పాత పద్ధతిలోనే నడుస్తున్నారు. అందులో గోపీచంద్ ఒకడు.
ఆరడుగుల హైటు, మాస్‌కి మురిపించే క్వాలిటీసూ, ప్రతిభ.. ఇవన్నీ పుష్కలంగా ఉన్న కథానాయకుడు గోపీచంద్. హీరో నుంచి విలన్‌గా మారి, మళ్లీ విలన్ నుంచి హీరోగా షిఫ్ట్ అయిన ఏకైక హీరో. తన ఖాతాలో మంచి కమర్షియల్ సినిమాలున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా గోపీచంద్‌కి ఏదీ కలసి రావడం లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. రొటీన్ జోనర్లను, ఫక్తు కమర్షియల్ కథలను పట్టుకుని వెళ్లడమే… అందుకు కారణం. లౌక్యం, శౌఖ్యం, శంఖం, అంటూ…. అదేంటో అతని టైటిళ్లు కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు ‘పంతం’ అని పెట్టుకున్నాడు. టైటిల్ చూస్తేనే అర్థమైపోతోంది… అందులో హీరో క్యారెక్టరైజేషన్ ఏమైఉంటుందో. పంతం, పట్టుదల, శపథం.. ఇలాంటి టైటిళ్లకు ఏనాడో చమరగీతం పాడేశారు మన హీరోలు, దర్శకులు. కానీ.. పాపం.. గోపీచంద్ మాత్రం అవే పట్టుకుని వేలాడుతున్నాడు. అందులోనూ… గోపీచంద్‌కి టైటిల్ చివరన సున్నా రావడం సెంటిమెంట్. గోపీచంద్ ఇప్పుడు నమ్ముకోవాల్సింది సెంటిమెంట్లను కాదు. కొత్తదనాన్ని. పదే పదే ఇలాంటి మూస దానిలోనే వెళ్తే… విలన్ నుంచి హీరోగా మారిన గోపీ.. మళ్లీ విలన్ పాత్రలకు షిఫ్ట్ అవ్వాల్సివస్తుంది. కనీసం టైటిళ్ల విషయంలోనైనా కొత్తగా ఆలోచించు బాసూ..!