‘జిల్’తో ఆకట్టుకొన్న దర్శకుడు రాధాకృష్ణ. గోపీచంద్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఆ తరవాత యూవీలోనే ‘రాధే శ్యామ్’ రూపొందించాడు రాధాకృష్ణ. ఇప్పుడు మరోసారి అదే సంస్థలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈసారీ గోపీచంద్ తోనే. గోపీచంద్ కథానాయకుడిగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌లో రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్క్రిప్టు పనులు దాదాపుగా పూర్తయినట్టే. ఈవారంలోనే గోపీచంద్‌కు ఫైనల్ నేరేషన్ ఉంది. అంతా ఓకే అనుకొంటే… ఈ యేడాదే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. గోపీచంద్ ఇటీవల `భీమా`తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా, మాస్ సినిమా కాబట్టి వసూళ్లు బాగానే దండుకొంది. గోపీచంద్ గత సినిమాలతో పోలిస్తే ‘భీమా’ కమర్షియల్ గా బాగానే పే చేసినట్టు లెక్క. మరోవైపు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్‌పై ఉంది. శ్రీనువైట్ల తరవాత గోపీచంద్ పట్టాలెక్కించే సినిమా యూవీ క్రియేషన్స్‌లోనే అవుతుంది. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన అప్ డేట్స్‌ని అధికారికంగా వెల్లడిస్తారు.