వాల్మీకి టైటిల్ – గద్దలకొండ గణేష్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే… ఈ సినిమాలో గద్దలకొండ గణేష్ ‘సిటీమార్’ అనే సినిమాలో హీరోగా నటిస్తాడు. అదీ పక్కా మాస్ టైటిలే. ‘డీజే’లో సిటీమార్… సిటీమార్ అంటూ అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్పులు కూడా వేశాడు. ఇప్పుడు అదే టైటిల్ గోపీచంద్ సినిమా కోసం వాడేస్తున్నారు. గోపీచంద్ – సంపత్‌నంది కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి ‘సిటీమార్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదో మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్. ఈమధ్య కాన్సెప్ట్ తరహా కథల్ని ఎంచుకుంటున్న గోపీచంద్, చాలా రోజుల తరవాత ఫుల్ మాస్ సినిమాని ఎంచుకున్నాడు. దానికి ‘సిటీమార్’ అనే టైటిల్ బాగుంటుందనిపించి, సంపత్ నంది ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేయించాడు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.