పోలీసు ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల మాధవ్.. రాజకీయ నేతగా తన వ్యవహారశైలిని మార్చుకోవడానికి తంటాలు పడుతున్నారు. లోక్‌సభలో ఆయన టీడీపీ ఎంపీలపై దాడి చేయడానికి దూసుకెళ్లిన వ్యవహారం.. నేషనల్ మీడియాలో హైలెట్ కాగా.. దాన్ని సమర్థించుకునేందుకు ఇప్పుడు… రాయలసీమ వాదం ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాయలసీమకు. హైకోర్టు కాదని.. రాజధాని కూడా ఇవ్వాలని కోరుతున్నారు. అనంతపురం నుంచి కియా సంస్థ వెళ్లిపోవాలని ఆలోచన చేస్తోందని.. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకటన చేసిన తర్వాత.. అందరి చూపు.. మొదటగా.. గోరంట్ల మాధవ్ పైనే పడింది. కియా కార్ ప్రారంభోత్సవ సమయంలో.. సీనియర్ మేనేజ్మెంట్ను గోరంట్ల మాధవ్ బెదిరించిన వ్యవహారం.. అప్పట్లోనే… ఆటోమోబైల్ ఇండస్ట్రి సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది.
అంతే కాదు.. కియా విడుదల చేసిన తొలి కారుపై.. చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఈ అంశాలే.. కియా యాజమాన్యంపై.. కొత్త ప్రభుత్వంపై వ్యతిరేక ముద్ర పడేలా చేశాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు ఇవే..మీడియాలో హైలెట్ అవుతూంటే.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తట్టుకోలేకపోతున్నారు. రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని.. అందుకే.. తాను లోక్‌సభలో.. ఆ విషయం చెప్పడానికే.. ఎంపీల వద్దకు వెళ్లానని… దాడి చేయడానికి కాదని అంటున్నారు. రాయలసీమకు అన్యాయం చేస్తూంటే తట్టుకోలేనని చెబుతున్నారు. చంద్రబాబు రాయిటర్స్ని ప్రభావితం చేశారని చెప్పుకొచ్చారు.
కియా పరిశ్రమను తరిమేయడం… రాయలసీమకు ఎలా మేలు చేసినట్లవుతుందో కానీ.. ఈ అంశంలోకి… జగన్ ను కూడా లాగే ప్రయత్నం చేశారు. రాయలసీమలో రాజధానిని పెట్టాలని.. కోరుతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే కర్నూలు వైసీపీ నేతలు.. రాజధానిని విశాఖకు వద్దని… కర్నూలులో పెట్టాలని అంటున్నారు. ఇప్పుడు..ఎంపీ కూడా శృతి కలిపారు. సీమ వైసీపీ నేతల్లో.. ఇప్పుడీ డిమాండ్ సెటిమెంట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.