స్కిల్ ప్రాజెక్ట్ కేసులో చంద్రబాబు అవినీతి అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ… గోబెల్స్ ను మించిపోతున్న జగన్ రెడ్డి సర్కార్ తాము చెబుతున్నవన్నీ అబద్దమని.. ప్రభుత్వ వెబ్ సైట్లలోనే… అధికారిక సమాచారం ఉంటూండటంతో సిగ్గుపడింది. ఆ సమాచారాన్ని వెబ్ సైట్ల నుంచి తొలగించింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎలా ప్రారంభమయిందనే దగ్గర్నుంచి డబ్బుల విడుదల… పర్యవేక్షణ సహా మొత్తం ఎలా నడిచిందనేదానికి డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు విడుదల చేసిన జీవోలు వెబ్ సైట్లో ఉన్నాయి. కానీ హఠాత్తుగా ప్రభుత్వం వాటిని తొలగించింది.
జగన్ రెడ్డి సర్కార్ జీవోలను రహస్యంగా ఉంచుతోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం దేనిని రహస్యంగా ఉంచలేదు. అన్నింటినీ వెబ్ సైట్లో పెట్టారు. ఆ డీటైల్స్ ఇప్పటి వరకూ ఉన్నాయి. అందరూ ఆ జీవోలను డౌన్ లోడ్ చేసుకుని ప్రభుత్వం తప్పు చేస్తోందని వాదిస్తూండటంతో హఠాత్తుగా వాటిని తీసేశారు. అంటే తాము చేసే తప్పుడు పనుల జీవోలను వెబ్ సైట్లో పెట్టడం ఆపేయడం కాకుండా… అప్పట్లో అంతా పారదర్శకంగా జరిగిందని చెప్పే జీవోలను కూడా దాచేశారన్నమాట. ఇందులో ప్రభుత్వ పెద్దల కుట్ర ఎంత ఎక్కువగా ఉందో స్పష్టతగా వస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
స్కిల్ డెవలప్మ్ంట్ శాఖ కింద సీమెన్స్ సెంటర్ల పెట్టడానికి సంబంధించిన ఒరిజినల్ ఫైల్ మిస్సయిందని ప్రభుత్వం ఇప్పటికీ ఆరోపిస్తోంది. షాడో ఫైల్ లోని కాగితాలను చూపించి హైలెట్ చేస్తోంది. ఆ ఫైల్ పోవడం ఏమిటన్నది అధికార వర్గాలకే విచిత్రంగా ఉంది. ఆ ఫైల్ చంద్రబాబు ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు. నిజానికి ఏ ఫైల్ కూడా సీఎం ఆధ్వర్యంలో ఉండదు. ఆయా శాఖల ఆధ్వర్యంలో ఉంటుంది. కానీ.. ప్రభుత్వం చెప్పేది కాగితం ఫైల్ కాదని.. ఈ ఫైల్ అని.. దాన్ని ఎలా పోగొడతారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ ఫైల్ పోయినదానికీ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే… కుట్ర ఎంత తీవ్రమైనదో అర్థం అవుతోంది.