సీఎం జగన్‌తో టాలీవుడ్ బృందం భేటీలో నాగార్జున కనిపించలేదు. చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్ మాత్రమే సూపర్ స్టార్లు వెళ్లారు. వీరు కాకుండా దర్శకనిర్మాతలు రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి ఉన్నారు. ఇక వీరు తాడేపల్లికి వెళ్లే సరికి అక్కడ అలీ, పోసాని, నారాయణ మూర్తి ఉన్నారు. టాలీవుడ్ సమస్యలపై సీఎం జగన్ వారితోనే చర్చలు జరిపారు. మిగతా వారి సంగతేమో కానీ నాగార్జున రాకపోవడమే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. సీఎం జగన్‌తో నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఇటీవల వ్యక్తిగతంగా వెళ్లి జగన్‌తో భేటీ అయ్యారు. సీఎం జగన్‌ను చూసి చాలా రోజులు అయిందని చూసేందుకు వచ్చానని చెప్పారు. అంత స్నేహం ఉన్న నాగార్జన టాలీవుడ్ సమస్యలపై చర్చించేందుకు జరిగే భేటీకి కూడా హాజరవుతారని అనుకున్నారు. గతంలో టాలీవుడ్ తరపున జరిగిన భేటీ టీల్లో నాగార్జున పాల్గొన్నారు. కానీ అనూహ్యంగా నాగార్జున హాజరు కాలేదు. కారణమేమిటో స్పష్టత లేదు. గతంలో చిరంజీవి ఒక్కరే సీఎంతో భేటీ అయినప్పుడు .. తనకు కూడా ఆహ్వానం వచ్చిందని కానీ బంగార్రాజు ప్రమోషన్స్లోబిజీగా ఉండటం వల్ల వెళ్లలేకపోయానన్నారు.
ఇప్పుడు కూడా అలాంటి వ్యాపార వ్యవహారాల మీద బిజీగా ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ హీరో ఎన్టీఆర్ కూడా సీఎం జగన్‌తో భేటీకి అంగీకరించారని ప్రచారం జరిగింది. అయితే మిగతా హీరోలు వేరు.. ఎన్టీఆర్ వేరు. ఆయన జగన్‌తో జరిగే భేటీలో పాల్గొని.. ఆ తర్వాత ప్రభుత్వం గురించి పాజిటివ్‌గా మాట్లాడితే అది రాజకీయ అంశం అవుతుంది. ఆ కోణంలో ఆలోచించి ఆగిపోయినట్లుగా తెలుస్తోంది.