తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కర్నూలు పోలీసులు నోటీసులు ఇవ్వలేదు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి .. మీడియాకు మేత పెట్టడానికి ప్రత్యేకంగా ఓ టీం కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది. కానీ చివరి క్షణంలో పై నుంచి ఆదేశాలు రావడంతో ఆగిపోయారు. చంద్రబాబు భయంకరమైన తప్పుడు చేశారన్నట్లుగా.. శనివారం మీడియాతో మాట్లాడిన… ఎస్పీ ఫకీరప్ప.. ఆదివారమే.. కర్నూలు నుంచి ప్రత్యేక బృందం.. హైదరాబాద్లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి నోటీసులు ఇస్తుందని ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగా ఓ బృందం హైదరాబాద్ వచ్చింది. వైసీపీ అస్మదీయ మీడియాకు ముందుగానే సమాచారం ఇచ్చారు. నోటీసులు ఇస్తారు..కావాల్సినంత రచ్చ చేసుకోవాలి.
అందుకే చంద్రబాబు ఇంటి దగ్గర.. రెండు, మూడు చానళ్లు.. లైవ్ వ్యాన్లతో రెడీగా ఉన్నాయి. పొద్దుటి నుంచి రాత్రి వరకూ ఉన్నా.. పోలీసులు ఎవరూ రాలేదు. ఈ మధ్యలో.. అమరావతిలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. చంద్రబాబు కేవలం సమాచారం మాత్రమే చెప్పారని… ఇటీవల.. పాండమిక్ సమాచారం షేర్ చేసుకోవడం… తప్పు అని కేసులు పెడితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని.. సుప్రీంకోర్టు హెచ్చరిందని.. పోలీసులకు న్యాయనిపుణులు నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో… ఈ వ్యవహారం హైకోర్టుకు చేరితే.. గతంలో విశాఖలో చంద్రబాబును అడ్డుకున్నట్లుగా పోలీసు వ్యవస్థపై హైకోర్టు చేసిన వ్యాఖ్యల తరహాలోమరోసారి షాక్ తగిల్తే.. ఉన్న పరువు కూడా పోతుందని.. నోటీసుల ప్రక్రియను డీజీపీ సవాంగ్ వ్యతిరేకించినట్లుగా చెబుతున్నారు.
అయితే ఇప్పుడు పోలీసు వ్యవస్థను డీజీపీ కన్నా ఎక్కువగా .. ఓ ముఖ్య సలహాదారు నియంత్రిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం ఆ సలహాదారను డీజీపీ లెక్క చేయలేదని అంటున్నారు. అందుకే … మీడియాతో మాట్లాడుతూ.. ఇది రాజకీయం చేయాల్సిన సమయం కాదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో… మంత్రి అప్పలరాజు.. కర్నూలులో కొత్త రకం వైరస్ ఉందని టీవీ డిబేట్లో ఒప్పుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనపై ఇద్దరు ఫిర్యాదులు చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. చంద్రబాబుకు నోటీసులు ఇస్తే.. వాటిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో ఇప్పటికే ప్లాన్ రెడీ చేసుకున్న టీడీపీ.. ఆగిపోయినా… కొత్త వ్యూహం అమలు చేయాలని నిర్ణయించుకుంది. కొత్త వైరస్ గురించి చెప్పారని చంద్రబాబు పై కేసు పెట్టిన పోలీసులు మంత్రిపై కూడా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని, లేని పక్షంలో కోర్టుకు వెళ్లాని నిర్ణయించుకుంది.