ప్రభుత్వ పరంగా సమస్యలుండి, అవి పరిష్కారం కాకపోతే ‘జగనన్నకు చెబుదాం’ అంటూ 8296082960 నంబరుకు ఫోన్‌చేసి జగన్ మోహన్ రెడ్డితో నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించారు.ఈనెల 13న ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఎప్పటి నుండో తమ అభిమాన నేతకు తమ సమస్యలను తెలియజేయాలని తహతహలాడుతున్న కేడర్‌కు ఇది ఒక అవకాశంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ సీఎంను కలిపే పరిస్థితులు ఎవరికీ దక్కలేదు.
అధికారంలోకి రాకముందు మాత్రం తమ ప్రాంతం వచ్చినప్పుడో లేదా మరే సందర్భంలోనో జగన్‌ను నేరుగా కలిసిన అనేక మందికి ఇది ఒక మంచి అవకాశంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అది నుండి పార్టీ జెండా మోసి పార్టీకి పనిచేసిన వారిలో చాలా మంది ఇప్పుడు యాక్టివ్‌గా లేరు. వీరంతా నాలుగేళ్లుగా వారు అధికారానికి దూరంగా ఉంటూ సొంత పార్టీలోనే గుర్తింపు లేకుండా పోయిందని మదన పడుతున్నారు. ఇప్పుడు వీరంతా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా తాము ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు చెప్పుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఎలా అని ఇప్పుడు వైసీపీ నాయకత్వం మథనపడుతోంది.
ప్రభుత్వ సమస్యలు తీర్చాలనుకునే స్కీమ్‌లో పార్టీలో అసంతృప్తులు బయటకు వస్తే సమస్య అవుతుంది. అసలు కేడర్కుకూడా చాలా సమస్యలు ఉన్నాయి. 90శాతం మంది కేడర్ చిన్న చిన్న పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ పరంగా కూడా క్యాడర్‌కు మేలు చేయకపోతే ఇక పార్టీ నాయకత్వం ఎందున్న డౌట్ అందరికీ వస్తుంది. అందుకే ఈ చెప్పుకోవడం ఏమో కానీ చాలా సమస్యలు సృష్టించేలా ఉందని మథనపడుతున్నారు.