వారంలో రద్దు చేసి పడేస్తానని జగన్ ఇచ్చిన హమీ సీపీఎస్ రద్దు. కానీ వారంలో కాదు ఒక్క క్షణంలో రద్దు చేయగలను… కానీ ఎందుకు ఆలోచిస్తున్నానో తెలుసా అంటూ మూడేళ్ల తర్వాత .. రూ. కోట్లతో ప్రకటనలు విడుదల చేశారు సీఎం జగన్. అంతకు ముందు తెలియక ఇచ్చిన హమీ అని తమ సజ్జలతో చెప్పించారు. సీపీఎస్ బదులు జీపీఎస్ తెస్తామని కొత్త ప్రతిపాదన తెచ్చారు. దాని కోసం ఎన్నో లెక్కలు చెప్పారు. అయితే ఇవన్నీ సీపీఎస్ ఉద్యోగుల ఆగ్రహాన్ని మరింత పెంచుతున్నాయి కానీ ఏ మాత్రం తగ్గించడం లేదు. ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందన్న అభిప్రాయం బలపడుతూండటంతో వారిలో ఆవేశం కూడా పెరుగుతోంది.
సీపీఎస్ ఉద్యోగులు ఇటీవల ప్రత్యేక కార్యాచరణ పోరాటం చేస్తున్నారు. ఆదివారం వారు చేసిన పోరాట హైలెట్ అయింది. శిరోముండనాలు చేసుకున్నారు. తమను తాము చెప్పులతో కొట్టుకున్నారు. ప్రభుత్వం.. జగన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వారి ఆవేశం చూస్తే ప్రభుత్వానికి వారు లొంగే ప్రశ్నే లేదన్న అభిప్రాయం ఎవరికైనా అర్థమవుతుంది. కొంత మంది ఉద్యోగ సంఘ నేతల్ని మచ్చిక చేసుకుని వారితో సమ్మె విరమణ ప్రకటన చేయించినట్లుగా.. సీపీఎస్ విషయంలోనూ ఏదో ఓ వ్యూహం అవలంభిద్దామని ప్రభుత్వం అనుకుంటోంది. కానీ అలాంటివి పారవని సీపీఎస్ ఉద్యోగులు నిరూపిస్తున్నారు.
సీపీఎస్ 2003అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారంతా సీపీఎస్ పరిధిలోకి వస్తారు. అంటే వారికి పెన్షన్ భద్రత లేదు. తమ జీతంలో కత్తిరిస్తున్న మొత్తం సీపీఎఎస్ పండ్‌కు వెళ్తే … దాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. వచ్చే ఆదాయాన్ని బట్టి పెన్షన్ ఉంటుంది. దాచుకున్నదాన్ని తీసుకుంటే ఏ పెన్షన్ రాదు. 2003 కింద ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానం వర్తిస్తంది. ఆ విధానం ప్రకారం…ఉద్యోగి ఏమీ చెల్లించకపోయినా పెన్షన్ వస్తుంది.
సీపీఎస్ రద్దు చేయడం.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయడం భారమని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. కానీ రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సీపీఎస్ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. 2004 తర్వాత చేరిన వారెవరికీ సీపీఎస్ ఉండదని పాత పెన్షన్ విధానమే ఉంటుందని ప్రకటించారు. అక్కడ ప్రభుత్వానికిలేని భారం… ఏపీ ప్రభుత్వానికి ఎలా వచ్చిందనేది ఎవరికీ తెలియని..అంతుచిక్కని ప్రశ్న..!