ఏపీ ప్రభుత్వానిది ఇంత క్రూరత్వమా అని హైకోర్టు న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయారు. ఆ కేసు గురించి తెలిసిన అందరూ…. పాలకుడి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియదా అని కోపం తెచ్చుకున్నారు. ఆ కేసు ఏమిటంటే… అంగన్ వాడీ స్కూల్ కు వెళ్లిన చిన్నారి అక్కడ పెట్టిన గుడ్డు తిని అస్వస్థతకు గురై కాసేపటికే చనిపోయింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని తేల్చి హెచ్ఆర్సీ పరిహారం ఇవ్వమంది. అయితే తాము చెల్లించే ప్రశ్నే లేదని అది గాడ్ ఆఫ్ యాక్ట్ అని వాదిస్తూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. లాయర్‌కు లక్షలు చెల్లించి ఉంటుంది కానీ ఆ బిడ్డ తల్లిదండ్రులకు పరిహారం మాత్రం ఇవ్వనంది. ఈ కేసును విచారించి న్యాయమూర్తి కూడా కలత చెందారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం, గుల్లేపల్లి అంగన్వాడీ కేంద్రంలో 2022 ఫిబ్రవరి 17న దీక్షిత అనే చిన్నారి మృతి చెందింది.. సిబ్బంది నిర్లక్ష్యంతో కోడి గుడ్డు గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి దీక్షిత మృతి చెందింది.. దీనిపై పాప తల్లిదండ్రులు అంగన్వాడీ సిబ్బందిని నిలదీశారు.. రోడ్డు ఎక్కి ఆందోళన చేశారు.. అయితే అనారోగ్యంతో దీక్షిత మృతి చెందింది అంటూ అంగన్వాడీ సిబ్బంది బుకాయించారు.. న్యాయం చేయాలంటూ దీక్షిత తల్లిదండ్రులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు.. దీక్షిత మృతదేహాన్ని ఖననం చేసిన 4 నెలల తర్వాత హెచ్ఆర్సీ ఆదేశం మేరకు పోస్టుమార్టం నిర్వహించారు..
కోడిగుడ్డు గొంతులో ఇరుక్కోవడంతోనే దీక్షిత మృతి చెందింది అంటూ పోస్టుమార్టం రిపోర్ట్ వెల్లడించింది.. దీంతో దీక్షిత కుటుంబానికి 8 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలంటూ 2023 జనవరి 31న హెచ్ఆర్సీ ఆదేశించింది.. హెచ్ ఆర్ సి నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం. ఇలాంటి ఘటనల్లోనూ కోర్టుకు రావడం చిన్నారి తల్లిదండ్రులకు పరిహారం ఇవ్వడానికి సిద్ధపడకుండా… లాయర్లకు లక్షలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధపడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మానవత్వం లేని పరిపాలనకు ఇదే నిదర్శనమని గుర్తు చేస్తున్నారు.