జగన్ రెడ్డికి ప్రజాధనం అంటే పంచదార లాంటిది. గుప్పిళ్లు గుప్పిళ్లు బుక్కేసుకోవడానికి ఆయన ఐదేళ్లు శ్రమిస్తూనే ఉన్నారు. దానికి మరో ఉదాహరణ… జగన్ ఇంటి చుట్టూ కట్టించుకున్న ఇనుప మెష్ కు రూ. పదమూడు కోట్లు ఖర్చ పెట్టడం.
జగన్ ప్యాలెస్ మొత్తం విలువ ఆయన బినామీ కంపెనీల ద్వారా కొనుగోలు చేసినప్పుడు రెండు కోట్లు ఉంటుంది. ఇప్పుడు ఆయన తన ఇంటి చుట్టూ మెష్ కోసం రూ . పదమూడు కోట్లు ప్రజాధనం ఖర్చు చేశారు. ఈ మేరకు సీక్రెట్ గా ఉంచిన జీవోనూ టీడీపీ బయట పెట్టింది. పదమూడు కోట్లు పెట్టి దుర్భేద్యమైన ప్యాలెసే కట్టించుకోవచ్చు కదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ మెష్కు పదమూడు కోట్లు ఇచ్చేశారు. అంటే.. అందులో కమిషన్లు పోను.. మహా అయితే కోటో.. రెండు కోట్లో అసలు ధర ఉంటుంది. జగన్ నిర్వాకం చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
జగన్ ఇంటికి ప్రజాధనం రెండు, మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిచేశారు. కానీ ఓడిపోయిన తర్వాత.. ప్రతిపక్ష నేతహోదా కూడా రాకపోయినా కనీసం కుర్చీలు కూడా వెనక్కి పంపేందుకు జగన్ ఆసక్తి చూపించడం లేదు. తన ప్రైవేటు ఇంట్లో ప్రభుత్వ ఆస్తులు ఇన్ని ఉన్నాయి తీసుకెళాలని కూడా ఆయన చెప్పడం లేదు. ఇప్పుడు పార్టీ ఆఫీసుగా వాడేసుకుంటున్నారు. సీఎంగా ఉన్నప్పుడు రివ్యూలు పెట్టిన చోట పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. కనీత నైతిక ఉన్న ఒక్కరు కూడా ఇలాంటి పనులు చేయరు.