తిరుమల, తిరుపతి దేవస్థానం భూములను అమ్మేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించుకోవడం..గుట్టుగా వ్యవహారాలు సాగించడం.. చివరికి ఇప్పుడు బయటకు రావడంతో…దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వెంకన్న జోలికి వెళ్లవద్దనే హెచ్చరికలు కూడా వినిపించాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా… భూముల విక్రయ నిర్ణయం ఉందన్న అభిప్రాయం రావడంతో…ఇప్పుడు ప్రభుత్వంపై మరక పడకుండా ఉండేందుకు .. వైసీపీ నేతలు..కొత్త వాదన తెరపైకి తీసుకు వస్తున్నారు. అసలు భూముల అమ్మకం నిర్ణయానికి.. ప్రభుత్వానికి సంబంధం ఏమిటనేవాదనను కోరస్గా వినిపించడం ప్రారంభించారు.
భూముల అమ్మకం నిర్ణయం టీటీడీ బోర్డు తీసుకుదని.. విపక్షాల ఆరోపణులననీ తప్పుడువేనని.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..చెప్పుకొచ్చారు. ఇదే వాదనను మరికొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. టీటీడీ ఆస్తుల అమ్మకం సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే అంశం కావడంతో..ప్రభుత్వ పెద్దల అనుమతి లేకుండా.. భూములు అమ్మే నిర్ణయాన్ని బోర్డు తీసుకుంటుందని అంచనా వేయడం కష్టమే.ప్రభుత్వం ఇప్పటికే భూముల అణ్మకంఅనేదాన్ని ఓ విధానంగా తీసుకుంది. బిల్డ్ ఏపీ పేరుతో పెద్ద ఎత్తున భూముల్ని అమ్మకానికి పెట్టింది.
దీంతో.. టీటీడీ ఆస్తులు అమ్మే ప్రక్రియ కూడా… ప్రభుత్వ అనుమతితో జరిగిందని సామాన్య జనం కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు.. ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పడానికి.. ఆ నిర్ణయం మాదేనని నిరూపించడానికి టీటీడీ బోర్డు ప్రయత్నిస్తోంది. ఆ ఆస్తులు నిరర్థకం అని..మరొకటని చెప్పి.. భక్తుల్లో సెంటిమెంట్ పెంచేలా ప్రకటనలు చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు… ఈ రగడ నుంచి బయటపడాలా..అని కంగారు పడుతున్నారు.