కరకట్టపై చంద్రబాబు ఇంటిని కూల్చివేయడానికి అధికారం అందిన కొత్తలో ఉబలాటపడ్డ సీఎం జగన్ ..అది సాధ్యం కాదని తేలిన తర్వాత సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు మళ్లీ ఆయన కొత్త పగ బుసలు కొడుతోంది. ఆయన ఇంటిని జప్తు చేస్తూ సీఐడీ అధికారులతో ఆదేశాలు జారీ చేయించారు. ఎందుకంటే అమరావతి స్కాంలో సీఐడీ కేసులు నమోదయ్యాయని .. స్కాం జరిగిందని అందుకే స్థిరాస్తులు ఎటాచ్ చేస్తున్టన్లుగా హోంశాఖ కార్యదర్శి పేరుతో ఉత్తర్వులు జారీచేశారు. క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేశామని స్తానిక కోర్టుకు ఆదివారంసమాచారం ఇచ్చారు.
లింగమనేని కి చెందిన ఇంట్లో చంద్రబాబు చాలా కాలంగా ఉంటున్నారు. ఆ ఇంటిని జప్తు చేశారు. జప్తు చేశామన్న కారణం చూపి ఆ ఇంట్లో చంద్రబాబు ఉండకుండా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే సీఐడీ నమోదుచేసిన కేసులను గతంలోనే సుప్రీంకోర్టు కొట్టి వేసింది. స్టాక్ మారెట్లలో వాడే స్కాం పేరుతో నమోదు చేసిన కేసులు చెల్లవని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు అదే కేసులో సీఐడీ పేరుతో చంద్రబాబు ఇంటిని జప్తు చేయడం .. తమ పిచ్చి పగని తీర్చుకోవడానికేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
జగన్ మోహన్ రెడ్డికి చెందిన వందల కోట్ల ఆస్తులు ఈడీ జప్తు చేసింది. ఇప్పటికీ అనేక ఈడీ కేసులు పెండింగ్ లో ఉన్నాయి జప్తు చేసినా వాటిని నిరభ్యంతరంగా వాడుకుటూనే ఉన్నారు. జప్తుచేయడం అంటే.. వాటిపై లావాదేవీలు నిర్వహించకుండా ఉండటం వరకే. అయితే ఇక్కడ ప్రభుత్వాధినేత ఆలోచనలు మరో రకంగా ఉంటాయి కాబట్టి.. జప్తు చేశామని చెప్పి.. ఆ ఇంట్లోకి చంద్రబాబును వెళ్లకుండా చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కోర్టుతో ఎన్ని సార్లు కొట్టించుకున్నా అది అధికారులే కాబట్టి తన పగ నెరవేరుతుందనే ఉద్దేశంలోనే మొదటి నుంచి ఈ పాలకులు ఉన్నారు కాబట్టి.. ఈ విషయంలో చాలా డ్రామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆదివారం పూట వెలుగులోకి తెచ్చిన జప్తు ఉత్తర్వులు చూసి.. న్యాయనిపుణులు కూడా .. పాపం అనుకుంటున్నారు. పగతో ఏం చేస్తున్నామో తెలియనిస్థితికి పాలకులు చేరుకుంటున్నారని .. గుడ్డిగా చెప్పింది చేస్తూ అధికారులు ఊబిలో కూరుకుపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.