మణిపూర్లో అల్లర్ల కారణంగా స్వరాష్ట్రాలకు రావాలనుకున్న తెలుగు విద్యార్థులను నాలుగు రోజుల పాటు టెన్షన్ పెట్టి చివరికి ప్రత్యేక విమాాలు ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు. ఇప్పుడు వారితో పబ్లిసిటీ స్టార్ట్ చేసేశారు. మణిపూర్ నుంచి విద్యార్థులతో ప్రత్యేక విమానం హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు రాగానే తెలంగాణ నుంచి మంత్రి మల్లారెడ్డి.. ఏపీ నుంచి ఎంపీ భరత్ రంగంలోకి దిగిపోయారు. వారందరితో పీఆర్ ఎలా చెప్పించాలో ప్రాక్టీస్ చేయించి మీడియా ముందుకు పంపారు. పొగడ్తలు కురిపించుకున్నారు. మల్లారెడ్డి అయితే కాస్త ఓవర్ కాబట్టి దానికి తగ్గట్లుగా పిల్లల లగేజీ బ్యాగుల్ని కూడా మోసినంత పని చేశారు.
మణిపూర్లో అల్లర్లు చెలరేగిన తర్వాత అక్కడ ఎన్ఐటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులు వెనక్కి రావాలనుకున్నారు. కానీ అక్కడ సంపూర్ణంగా కర్ఫ్యూ విధించడంతో బయటకు రాలేకపోయారు. అక్కడ ఎన్ఐటీ క్యాంపస్ లో పరిస్థితులు దిగజారిపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుుల గగ్గోలు పెట్టారు. మూడు రోజుల పాటు ప్రభుత్వాలు వారిని పట్టించుకోలేదు.ఇదిగో ప్రత్యేక విమానం. అదిగో హెల్ప్ లైన్ అంటున్నారు కానీ ఎవరూ స్పందించలేదు. దీనిపై విపక్ష పార్టీలు స్పందించడంతో చివరికి చెప్పినట్లుగా విమానాలను ఏర్పాటు చేయక తప్పలేదు.
తప్పనిసరిగా చేయాల్సి వచ్చినప్పటికీ.. పబ్లిసిట కోసం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ప్రభుత్వాలు. రాజకీయ పార్టీలు తమ బాధ్యతను తాము నిర్వర్తించడం కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వేగంగా స్పందించకపోగా ఆలస్యంగానైనా అందర్నీ తీసుకొచ్చాం అదే గొప్ప అన్నట్లుగా పబ్లిసీటీ చేసుకుంటున్నాయి.