అమరరాజా ఫ్యాక్టరీని మూసివేస్తూ.. రాత్రి కి రాత్రే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం దాని కోసం చెప్పిన కారణాలను ఇప్పుడు కోర్టులో సమర్థించుకోలేకపోతోంది. అమరరాజా బ్యాటరీ పరిశ్రమ వల్ల ఉద్యోగుల రక్తంలో లెడ్ శాతం చాలా ఎక్కువగా ఉందని.. ఇది కాలుష్యం ప్రమాద స్థాయిని దాటేసిందని.. ప్రజల్ని అనారోగ్యానికి గురి చేస్తోందని అందుకే మూసివేస్తున్నామని ప్రకటించింది. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. ఉద్యోగులు.. సమీప ప్రజల బ్లడ్ రిపోర్టులను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ప్రకారం రక్తనమూనాలు తీసుకుని పరీక్షలు నిర్వహించారు0
. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నతాధికారులు ఈ పని పని చేశారు. పరీక్షల నివేదికలు వచ్చాయి. బ్లడ్ శాంపిల్స్ టెస్టులు.. ఒక రోజులో వస్తాయి. కానీ వారాల తరబడి ఇంకా తమకు రిపోర్టులు రాలేదని కోర్టుకు చెప్పడం ప్రారంభించారు. ఇప్పటికి రెండు సార్లు అలా వాయిదా కోరారు. బ్లడ్ శాంపిల్స్ రిపోర్టులు వచ్చినా కావాలనే కోర్టుకు సబ్మిట్ చేయడం లేదని అమరరాజా లాయర్లు వాదిస్తున్నారు. దీంతో కోర్టు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుఅధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ సారి ఇవ్వకపోతే .. మెరిట్ ప్రకారం తీర్పు చెబుతామని స్పష్టం చేసింది. ప్రభుత్వ తీరు చూస్తూంటే.. ప్రజలు, ఉద్యోగుల రక్తంలో లెడ్ ఉందంటూ తప్పుడు నివేదిక సృష్టించి అమరరాజా కంపెనీని మూసేయాలని కుట్ర పన్నారని. .. ఇప్పుడు వైద్య పరీక్షల్లో అసలు విషయం బయటపడుతోందని.. అందుకే కంగారు పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతోంది. రాష్ట్రాని ప్రతిష్టాత్మకమైన ఓ పరిశ్రమపై స్వయంగా ప్రభుత్వమే కుట్ర చేయడం అనేది పారిశ్రామిక వర్గాల్లో ఏపీ పై చాలా తీవ్రమైన బ్యాడ్ ఇమేజ్ తీసుకు వస్తుంది. అందుకే ఈ అంశంపై పరిశ్రమ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.