ఇదిగో అధికారంలోకి వచ్చేస్తున్నా మీ అందరికీ మొదటి బడ్జెట్లోనే రూ. 1150 కోట్లిస్తా అని.. అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. అందు కోసం అగ్రిగోల్డ్ బాధితుల్ని రెచ్చగొట్టి.. అప్పిరెడ్డిని.. ఆ రెడ్డిని.. ఈ రెడ్డిని ముందు పెట్టి పెద్ద నాటకం ఆడారు. గెలిచారు. ఐదేళ్లు అయింది. ఆయన చెప్పినట్లుగా రూ. 1150 కోట్లు ఇవ్వలేదు కదా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అసలు జగన్ రెడ్డి నమ్మించే స్టైల్ ఎలా ఉంటుందంటూ.. రూ.1150 కోట్లు అని చెప్పడంలోనే ఉంది. అదేంటి ఇస్తే వెయ్యికోట్లు లేకపోతే రూ. 1200 కోట్లు అని చెప్పొచ్చు కదా ఈ రూ. 1150 కోట్లు ఏంటి అనే డౌట్ వస్తుంది.. ఎవరికైనా. కానీ పక్క లెక్కతో జగన్ ఉన్నారని నమ్మించడానికి ఇలాంటి స్కెచ్ వేసి లెక్కలు చెబుతారు. 99.8 శాతం హామీలు అమలు చేశామని చెప్పుకున్నట్లుగా. ఈ తెలివితేటలకు లోటేమీ ఉండదు కానీ హమీలు అమలు చేయడానికి మాత్రం చేతులు రావడం లేదు.
ఆస్తులు వేలం వేసి బాధితులకు ఇస్తూంటే కోర్టులకు వెళ్లి అడ్డుకున్న జగన్ రెడ్డి
డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన తర్వాత అప్పటి ప్రభుత్వం వేగంగా స్పందించింది. అగ్రిగోల్డ్ ఆస్తులుగా ఉన్న 21 వేల ఎకరాలు అటాచ్ చేసి, యాజమాన్యాన్ని అరెస్టు చేయించింది. వాటిని వేలం వేసి… బాధితులకు డబ్బులు చెల్లించాలనుకునే ప్రక్రియను ప్రారంభిచంిది. అయితే తప్పుడు ఆరోపణలు చేసి కేసులు వేయించి అడ్డుకున్నారు వైసీపీ అధినేత. అప్పటికీ కోర్టు అనుమతితో టీడీపీ ప్రభుత్వం డిపాజిటర్లకి ఇవ్వడానికి సిద్ధం చేసిన రూ.250 కోట్లు పంపిణీ చేయకుండా అడ్డుకుని, తీరా అదే సొమ్ములో 14 కోట్లు తగ్గించి, 22 వారాల తరువాత 236 కోట్లే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు.
బాధితులకు పచ్చి మోసం .. ఇప్పటికీ రూపాయి విడుదల చైయని వైనం
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే బడ్జెట్లో రూ. 1150 కోట్లు ఇస్తామని సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలనూ పెట్టారు. కానీ రూపాయి కూడా విడుదల చేయలేదు. తర్వాత బడ్దెట్‌లో రూ. 200 కోట్లు కేటాయించారు . కానీ ఖర్చు చేయలేదు. ఆ తర్వాత అగ్రిగోల్డ్ బాధితులకు ఎలాంటి కేటాయింపులు లేవు. మంజూరు లేదు. అగ్రిగోల్డ్ సంస్థ 2015 జనవరిలో బోర్డు తిప్పేయడంతో డిపాజిట్‌దారులు, ఏజెంట్లు గుండెపోటుతో ఇప్పటి వరకు 300 మందిపైనే మృతి చెందారు. వారిలో 144 మందికి గత ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించింది. తాము వస్తే రూ. పది లక్షలు చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఇలా చావులతోనూ ప్రయోజనం పొందారు.
దండెత్తడానికి సిద్ధంగా ఉన్న 32 లక్షల మంది బాధితులు
అగ్రిగోల్డ్‌లో రాష్ట్రానికి చెందిన 19.52 లక్షల మంది డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టగా, దేశంలోని ఏడు రాష్ట్రాలలో 32 లక్షల మంది బాధితులు ఉన్నారు. బాధితులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. బాధితులకు రూ.3,964 కోట్లను చెల్లించాలని సిఐడి తేల్చింది. ఆస్తుల్ని అమ్మేసి న్యాయం చేద్దామని చూస్తే… అడ్డగోలు ఆరోపణలు చేసి.. కోర్టులకు వెళ్లి ఆపేశారు. ఇప్పుడు తాము వచ్చాక నిండా ముంచేశారు. ఇప్పుడు ఈడీ వేలం వేసిన కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేసింది. దీంతో ఇక ఎప్పటికీ సమస్య పరిష్కారం కాదని తేలిపోయింది.జగన్ రెడ్డిని నమ్మి బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేసిన ప్రభుత్వాన్ని నిందించారు. దూరం చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం గోచీ ఊడదీశాడు జగన్ రెడ్డి.