హైదరాబాద్ రియల్ఎస్టేట్ కు పెద్ద సమస్యగా మారిన చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ విషయంలో వస్తున్న అనేక అభ్యంతరాలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఇందు కోసం ముందుగా ఫుల్ ట్యాంక్ లెవల్ హద్దులను పునర్ నిర్వహించాలని నిర్ణయించింది. చాలా కాలం కిందట ఎఫ్టీఎల్ హద్దులను నిర్ణయించారు. వాటిపై అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు హైడ్రా దూకుడుతో… అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్లో ఉన్న ప్రధానమైన 71 చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్స్ పై సర్వే చేయించాలని.. కొత్త ఎఫ్టీఎల్ను ఖరారు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ముందుగా ముసాయిదా రిలీజ్ చేసిన తర్వాత ప్రజల అభ్యంతరాలు, సలహాలు,సూచనలు తీసుకుంటారు. ఫైనల్ గా అన్ని చెరువుల ఎఫ్టీఎల్ హద్దులను అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎఫ్టీఎల్ లోప ల ఉన్న భవనాలను నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో లేనివి కొత్తగా వచ్చే అవకాశం లేదని కానీ చెరవుకు దూరం గా ఉండి. .ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నట్లుగా రికార్డుల్లో ఉన్న వారికి మాత్రం ఊరట లభిస్తుందని అంటున్నారు.
ఎఫ్టీఎల్ ఖరారు చేస్తే ఆటోమేటిక్ గా బఫర్ జోన్ కూడా ఖరారవుతుంది. హైదరాబాద్ లో చెరువులు ఎక్కువ. సుదూరంగా చెరువు కనిపిస్తూందంటే ఇప్పుడు అక్కడ కొనుగోలు చేయడానికిచాలా మంది వెనుకడుగు వస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఈ అంశానికి అధికారికమైన క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొనుగోలుదారులకు భరోసా లభిస్తుంది.