లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం వేగంగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. బీఆర్ఎస్ హయాంలో దరఖాస్తులు చేసుకున్న వారికి వెంటనే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. పైగా ఫీజులో ఇరవై ఐదు శాతం రాయితీ కూడా ప్రకటించారు. ఎల్ ఆర్ ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ ఆర్ ఎస్ కు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించింది. మార్చి 31లోగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్ ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుంది.
రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చిన తర్వాత చాలా మంది లే ఓట్లు వేసి అమ్మేశారు. కానీ అనుమతులు తీసుకోలేదు. అనుమతిలేని లే అవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వాటిని కొనుగోలు చేసినవారికి నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్‌కి అవకాశం లేకుండాపోయింది. వారందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ప్లాట్లకి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశమిచ్చింది. వ్యక్తిగతంగా ప్లాట్లుకొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉన్నవారితోపాటు లే అవుట్లలో విక్రయం కాకుండా పెద్దసంఖ్యలో మిగిలిన స్థలాలకి క్రమబద్ధీకరణ పథకం అమలు కానుదంి.
అనుమతి లేని ఓ లేఅవుట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్అయి మిగిలిన 90 శాతానికి రిజిస్టర్ కాకుంటే ఎల్ ఆర్ఎస్ కింద వాటి క్రమబద్ధీకరణతోపాటు రిజిస్ట్రేషన్‌కి అవకాశం కల్పిస్తారు. దీని వల్ల చాలా ఎలాంటి లావాదేవీలు జరగకుండా పడి ఉన్న లే ఔట్లలో లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. ఎల్ ఆర్ఎస్ అమలులో పలు వెసులుబాట్లు కల్పిస్తున్నందున నిషేధిత జాబితాలోని భూముల్లోని ప్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకుప్రభుత్వం సూచించింది.
ప్రభుత్వ నిర్ణయం కారణంగా పెద్ద ఎత్తున లే ఔట్లలో రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయంతో పాటు అనుమతులు లేని కారణంగా వృధాగా పడి ఉన్న వెంచర్లు యాక్టివ్ అవుతాయి.