పదహారో తేదీ నుంచి మరోసారి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల కంటే కేటీఆర్కు గట్టి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఇప్పటికే గవర్నర్ వద్ద ఏసీపీ అప్లికేషన్ పెడింగ్ లో ఉంది. దానిపై గవర్నర్ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదు. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో ఒప్పందాలు చేసుకుని వచ్చారని అందుకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. లేదని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.
అయితే కేటీఆర్ ఇటీవల ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు. ఎందుకో తెలియదు కానీ..ఆయనపై విచారణకు గవర్నర్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుదంని తెలిసిన తర్వాతనే ఆయన ఎక్కువగా ఫ్రస్ట్రేట్కు గురవుతున్నారని కాంగ్రెస్ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. ఆయన రూ. యాభై కోట్లు అక్రమంగా తరలించినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నా… కేసు పెట్టేందుకు అనుమతి ఇవ్వకపోతే కేటీఆర్ ను కాపాడుతున్నారన్న ముద్ర బీఆర్ఎస్పై పడే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి విషయాల్లో తనపై అలాంటి ముద్రలు ఎందుకని బీజేపీ పెద్దలు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
కేటీఆర్ పై కేసు నమోదు చేస్తారు కానీ వెంటనే అరెస్టు చేసే అవకాశాలు ఉండకపోవచ్చని అంటున్నారు. ఏసీబీ కేసులోని కీలక అంశాలు ముందు ప్రజల ముందు పెడతారని.. ఎంత దర్జాగా ప్రజాధనాన్ని లెక్కాపత్రం లేకుండా తరలించాలో తెలియచేస్తారని అంటున్నారు. ఏ కారణంతో ఇచ్చినా ముందు.. .. ప్రజాధనం ఇతరుల అకౌంట్ కు బదిలీ చేయాలంటే.. ఓ పద్దతి ఉండాలని.. అది పాటించకపోవడం నేరం అవుతుందని గుర్తు చేస్తున్నారు.