బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవహారశైలి ఎంత దారుణంగా ఉంటుందో మరోసారి నిరూపితమయింది.. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని సీటీ రవి వక్రీకరించి చదివారు.రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డులోకి తీసుకోవాలని, గవర్నర్ తన ప్రసంగంలో కొత్తగా జోడించిన అంశాలను తీసివేయాలని సీఎం స్టాలిన్ స్పీకర్‌ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రమే గవర్నర్ ఒరిజినల్ స్పీచ్‌గా రికార్డు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు.
అసెంబ్లీ ప్రసంగంలో గవర్నర్ రవి.. ద్రవిడ నేతల గురించి ప్రస్తావించలేదు. అంబేద్కర్, ద్రవిడ మోడల్‌కు చెందిన విషయాలను ఆయన చదవలేదు. ప్రసంగంలో ఉన్న 65వ పేరాకు చెందిన స్పీచ్‌ను గవర్నర్ విస్మరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ద్రవిడార్ ఖజగం వ్యవస్థాపకుడు పెరియార్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, మాజీ సీఎం కామరాజ్, అన్నాదురైల గురించి ఉన్న వ్యాఖ్యలను గవర్నర్ తన ప్రసంగం సమయంలో స్కిప్ చేశారు. ఈ ఘటన తర్వాతే సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు గవర్నర్ ప్రసంగంపై తీర్మానం చేపట్టారు.
డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించాయి. బిల్లు క్లియర్ చేయడంలో గవర్నర్ ఆలస్యం చేస్తున్నట్లు ఆ పార్టీలు ఆరోపించాయి. అసెంబ్లీలో ఆమోదం పొందిన 21 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు డీఎంకే మిత్రపక్షాలు ఆరోపించాయి. గవర్నర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో నినాదాలు హోరెత్తాయి. క్విట్ తమిళనాడు అని స్లోగన్స్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని తమపై రుద్ద వద్దు అని డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
అసలు గవర్నర్ కు ఇలా ప్రసంగించేచాన్స్ఇచ్చి ఉండకూడదని.. తెలంగాణలోకేసీఆర్ చేసినట్లుగా .. అసలు గవర్నర్ ఉనికిని గుర్తించకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా గవర్నర్ వ్యవస్థమరోసారి వివాదాస్పదం అయింది.