గవర్నర్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని ప్రభుత్వం మూడు నెలల నుంచి ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పుడు అనుమతి వచ్చేసింది. ఆ అనుమతిని సీఎస్ శాంతి కుమారి ఏసీబీకి పంపించారు. కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇక ఏసీబీ రంగంలోకి దిగాల్సి ఉంది. మాములుగా అయితే రాజ్ భవన్ నుంచి అమోదం అనే సమాచారం రాగానే దూసుకెళ్లాలి. కానీ కేబినెట్ లో చర్చలు.. సీఎస్ లేఖలు ఏసీబీకి పంపడం అంటూ తాత్సారం చేస్తున్నారు.
కేసులు పెట్టారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారణ చేయాలని కూడా సీఎస్ ఆదేశాలు ఇచ్చారు . ఇప్పటి వరకూ ప్రభుత్వం లీకులు ఇచ్చిన వివరాల ప్రకారం ప్రత్యేకంగా సాక్ష్యాల సేకరణ కూడా అవసరం లేదు. అన్నీ రెడీగా ఉన్నాయి. విదేశాలకు డబ్బులు తరలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఓ విదేశీ సంస్థకు డబ్బులు పోయాయి. అలా తరలించినట్లుగా ఒప్పుకున్నారు. మరి దానికి అనుమతులు మాత్రం లేవంటున్నారు. అంటే డైరక్ట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన సాక్ష్యాలు ఉన్నట్లే.
ఈ రేసు కంపెనీతో ఒప్పందంఉన్నా.. ఏమి ఉన్నా.. ముందు డబ్బులు పంపితే దానికి అన్ని స్థాయిలోఅనుమతి అవసరం. మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని అప్పుడు పాత తేదీలతో అయినా కరెక్ట్ చేసుకోవచ్చని అనుకుని ఆలస్యం చేశారు. అందు వల్లే ఇప్పుడు సమస్యలు వచ్చాయి. ఏసీబీ ఇప్పుడు ఏం చేయబోతున్నది రాజకీయ పరిణామాలను నిర్దేశించనుంది.