అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేయడం లేదని ప్రభుత్వం హైకోర్టులో గట్టిగా చెప్పలేకపోతోంది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించినా తగినంత సమయం ఇచ్చిన కౌంటర్ దాఖలు చేయలేదు సరి కదా.. పిటిషన్ వేసిన వారిలో ఒకరు అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారనే వితండ వాదనను ప్రభుత్వం తరపు లాయర్లు హైకోర్టులో వాదించారు. ఆ అంశం తమ వద్ద విచారణ జరగడం ధర్మాసనం చెప్పడంతో నాలిక్కరుచుకున్న లాయర్లు… కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని కోరారు.
సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం కొండమోడు వద్ద ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ జరిగుతోందదని వైసీపీ కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్టు 26న ఈ వ్యాజ్యంపై విచారణ జరిగింది. అక్రమ మైనింగ్‌పై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత పిటిషనర్లు ఆరోపించిన గ్రామాల్లో అక్రమ మైనింగ్ పై అధికారులు విచారణ జరిపినట్లుగా మీడియాలో వచ్చింది.కానీ నివేదిక ఏమిటన్న దానిపై క్లారిటీ లేదు. అలాగని కోర్టుకూ సమర్పించలేదు.
కౌంటర్ ఎప్పుడు దాఖలు చేస్తారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పడంతో వచ్చే మంగళవారానికి విచారణ వాయిదా వేసింది. ప్రభుత్వానికి చెందిన గనులను అక్రమంగా తవ్వుకుంటే.. తక్షణం చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. కోర్టులో పిటిషన్లు పడిన తరవాత కూడా… సరైన చర్యలు తీసుకోవడం లేదు. అక్రమ మైనింగ్ జరిగిందా లేదా అన్నదానిపై ఎంత సమయం ఇచ్చినా చెప్పడానికి సిద్ధపడటం లేదు.