ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన మరో నాలుగు వేల కోట్లు అప్పు.. పన్నుల వాటాలో వచ్చిన మూడు వేల కోట్లు కలిపి మొత్తం ఇరవై ఒక్క వేల కోట్ల ప్రజాధనం ప్రభుత్వ ఖాతాల్లో ఉండాలి
పోలింగ్ ముగిసిన తర్వాత రోజే.. ఖాతాల్లో డబ్బులు వేయడానికి అకాశం ఉంది., కోర్టు, ఈసీ పర్మిషన్ ఇచ్చింది. కానీ పోలింగ్ ముగిసి రెండు రోజులు అయినా ఎలాంటి ప్రకటనా ప్రభుత్వం వైపు నుంచి రావడం లేదు. ప్రజా తీర్పు ప్రస్తుతం ఈవీఎంలలో ఉంది. ఇలాంటి సందర్భంలో ఇష్టారీతిన వేల కోట్లు తరలించడం నైతిక విరుద్ధమే. అయితే ఈ సర్కార్ కు.. ఇందులో ఉన్న అధికారులకు నైతిక విలువలు అనే పదమే తెలియదు. అందుకే ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
గత ఆరు నెలల నుంచి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయలేదు . వివిధ పథకాల కింద బాకీ పెట్టారు. ఎన్నికలకు ముందు ఓటర్ల ఖాతాల్లో వేస్తామని మభ్య పెట్టారు కానీ.. గెలిచే అవకాశం లేదు కాబట్టి అలా వేయరని.. ఆ మొత్తాన్ని తర్వాత అయినా అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లిస్తారన్న వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే ప్రజల్ని ఇంత ఘోరంగా మోసం చేసిన పాలకుడు మరొకరు ఉండరు.