జీవితంలో ఎంతో ప్రతిభావంతులుగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అన్నీ తెలిసి చేసే కొన్ని తప్పుల వల్ల అప్పటి వరకూ సంపాదించిన పేరు ప్రఖ్యాతులన్నీ నాశనమైపోతూంటాయి. అమెరికాలో మంచి భవిష్యత్ ఉన్న వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్న గ్రాడియంట్ కంపెనీ సీఈవో అనురాగ్ బాజ్పాయి పరిస్థితి ఇప్పుడు ఇదే. ఆయన ఓ ఖరీదైన బ్రోతల్ కంపెనీలో సేవలు పొందినట్లుగా వెల్లడయింది. ఈ కేసులో ఇప్పుడు ఆయనపై విచారణ జరుగుతోంది.
కేంబ్రిడ్జిలో ఇటీవల పోలీసులు హై ప్రోఫైల్ బ్రోతల్ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా లగ్జరీ అపార్టుమెంట్లలో ఆసియాకు చెందిన మహిళల్ని ముఖ్యంగా సినీ తారల్ని, సెలబ్రిటీలు లాంటి వాళ్లతో వ్యభిచారం నిర్వహిస్తోంది. ఇక్కడ గంటకు యాభై వేల రూపాయలు వసూలు చేస్తారు. హైక్లాస్ వ్యభిచార ముఠా కావడంతో క్లయింట్లు కూడా ఆ స్థాయిలోనే ఉండేవారు. డాక్టర్లు, లాయర్లు, వ్యాపారవేత్తలు ఈ బ్రోతల్ కంపెనీ సేవలు పొందేవారు. ఇటీవల బోస్టన్ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి ఈ ముఠాను అరెస్టు చేశారు. అక్కడ దొరికిన సాక్ష్యాల ఆధారంగా ఎవరెవరు బ్రోతల్ సేవలు పొందాలో వెల్లడి అయింది. ఈ వ్యవహారంలో అనురాగ్ బాజ్ పాయ్ దొరికిపోయారు.
అనురాగ్ బజ్పాయ్ గ్రాడియంట్ కంపెనీ సీఈవో. చదువుకునేందుకు అమెరికా వచ్చిన ఆయన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్ మాస్టర్స్ చేశారు. పీహెచ్డీ కూడా చేశాడు. క్లీన్ వాటర్ టెక్నాలజీ స్టార్టప్ గా గ్రాడియంట్ ను ప్రారంభించారు. అనురాగ్ అభివృద్ధి చేసిన క మెంబ్రేన్-రహిత డీసాలినేషన్ టెక్నిక్ ను “టాప్ 10 వరల్డ్-చేంజింగ్ ఐడియాస్” లో ఒకటిగా “సైంటిఫిక్ అమెరికన్” గుర్తించింది కూడా. ఇప్పుడు గ్రాడియంట్ 25 దేశాల్లో విస్తరించింది. బిలియన్ డాలర్లకు పైగా విలువైన గ్లోబల్ కంపెనీగా ఎదిగింది. సెమీకండక్టర్స్, ఫార్మాస్యూటికల్స్, మైనింగ్, ఫుడ్ అండ్ బెవరేజ్ వంటి రంగాల్లో నీటి సమస్యలకు పరిష్కారం అందిస్తోంది.
ఎంతో కష్టపడి చదువుకుని పైకి వచ్చిన అనురాగ్ బజ్పాయ్ … క్లీన్టెక్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి. కానీ బ్రోతల్ కేసులో పట్టుబడటంతో ఆయన ఇమేజ్ కు మరక పడింది. హై ప్రోఫైల్ బ్రోతల్ కంపెనీలో సేవలు పొందిన వారు.. అలాగే మహిళల్ని అక్రమ రవాణా చేసిన వారిని గుర్తిచేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.