కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఓటరు నమోదు ప్రక్రియ ప్రాంభమయిది. ఓటర్లను నమోదు చేయించుకోవాల్సిన ఎన్నికలు కాబట్టి రెండు పార్టీలు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను ఖరారు చేశారు. వైసీపీ అభ్యర్థిగా పూనూరు గౌతంరెడ్డిని ఫైనల్ చేశారు. వైసీపీ తరపున ఫైనల్ చేసిన అభ్యర్థిని చూసి జగన్ రెడ్డి ప్రజల్ని అలుసుగా చూడటం అసలు మానరని వైసీపీ నేతలు గొణుక్కుంటున్నారు.
టీడీపీ అభ్యర్థి విద్యావేత్త. ఆయన చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నారై విద్యాసంస్థలను నడుపుతున్నారు. స్కూళ్లు, కాలేజీలతో ఎంతో మంది భావిపౌరుల్ని తీర్చిదిద్దారు. అదే సమయంలో ఆయనకు పొత్తుల్లో భాగంగా ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోవడంతో ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. ఆయనపై ఎలాంటి కేసులు లేవు. అవినీతి ఆరోపణలు లేవు. కానీ వైసీపీ అభ్యర్థి పూనూరు గౌతం రెడ్డి ఓ రౌడీషీటర్. విజయవాడలో ఆయన కార్మిక నేత పేరుతో చేసిన కబ్జాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు.
వంగవీటిరంగాను చంపడం కరెక్టేనని ఆయనను పాముతో పోల్చి వివాదాస్పదం కావడంతో జగన్ రెడ్డి ఆయనను పార్టీ నుంచి ఉత్తుత్తి సస్పెండ్ చేశారు . ఎప్పుడు ఎత్తేశారో ఎవరికీ తెలియదు కానీ పార్టీలో యాక్టివ అయిపోయారు. ఇప్పుడు ఆయన కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల తరపున ప్రాతినిధ్యం వహిస్తానని ఉబలాటపడితే జగన్ ఓకే అన్నారు. కొసమెరుపేమిటంటే.. ఈ గౌతం రెడ్డి .. అవినాష్ రెడ్డి తరపున వైఎస్ కుటుంబానికి బంధువు. బంధుత్వం.. నేరత్వం అన్నీ కలసి వచ్చాయని టిక్కెట్ ఇచ్చేశారు