గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. అయితే ఆ అభివృద్ది సమానంగా ఉండదు. కొన్ని కొన్ని ప్రాంతాలకు కొన్ని ప్రత్యేకమైన ప్లస్ పాయింట్స్ ఉంటాయి. అలాంటి ప్లస్ పాయింట్స్ యాడ్అయిన చోట్ల పట్టపగ్గాల్లేకుండా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది.
ప్రస్తుతం రంగారెడ్డిజిల్లా మీర్ ఖాన్ పేట అన్నింటి కన్నా ఎక్కువప్లస్ పాయింట్లు కలిగి ఉందని చెప్పక తప్పదు. దీని గురించి ఇప్పటి వరకూపెద్దగా ప్రచారం లేదు. కానీ వచ్చే పదేళ్ల తర్వాత మీర్ ఖాన్ పేట అత్యంత కాస్ట్లీ అంటే…కోకాపేట తరహాలో హాట్ ప్రాపర్టీ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఫోర్త్ సిటీని అత్యంత ప్రయారిటీగా తీసుకుంది. అందుకే ప్రధాన ప్రాజెక్టులు చాలా వరకూ అక్కడే కేటాయిస్తోంది. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఈ గ్రామం పరిధిలోనే నిర్మిస్తున్నారు. అలాగే ఏఐ సిటీని కూడా ఈ గ్రామం పరిధిలోనే నిర్మిస్తున్నారు. మరికొన్ని కీలక ప్రాజెక్టులను కూడా అక్కడే ప్రతిపాదిస్తున్నారు. ఫోర్త్ సిటీలో భాగంగా టెక్నాలజీ రంగానికి సంబంధించిన సంస్థలు, పరిశ్రమలు అనీ మీర్ ఖాన్ పేట చుట్టుపక్కన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ కారణంగా మీర్ ఖాన్ పేట రియల్ ఎస్టేట్ వర్గాలకు మంచి అవకాశంగా మారింది. బడా నిర్మాణ సంస్థలు కూడా అటు వైపు చూస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ఓ ప్రాపర్టీ ఉంటే పదేళ్ల తరవాత ఊహింనంతగా విలువ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.