గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె కెకే కుమార్తె. కేకేతో సహా పార్టీలో చేరిన ఆమె ఇప్పుడు మేయర్ గా ఉన్నారు. బీఆర్ఎస్ తరపున గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ మేయర్ గా ఉంటున్నారని బీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు. అందుకే అవిశ్వాసం పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. కానీ గ్రేటర్ కార్పొరేటర్లలో ఉన్న నెంబర్లను చూస్తే అలాంటి ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పరువు పోతుందని అనుకోవచ్చు. కానీ అలాంటిదేదో చేయాలని మాజీ మంత్రి తలసాని అనుకుంటన్నారేమో కానీ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు.
గ్రేటర్ లో బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లోనే పూర్తి మజార్టీ రాలేదు. 150 మంది ఉన్ గ్రేటర్ కార్పొరేట్లలో యాభై దగ్గరే ఆగిపోయారు. అయితే మజ్లిస్ సపోర్టుతో మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మిని గెలిపించుకున్నారు. ఇప్పుడు మజ్లిస్ బీఆర్ఎస్ వెనుక లేదు సరి కదా.. పది మందికిపైగా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రేపు అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ జరిగిదే మరో ఇరవై మంది జంపింగ్ కు రెడీ అవుతారు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ అండదండలు వారికి అవసరం.
ఈ అంశాన్ని అర్థం చేసుకోలేనంత రాజకీయ అజ్ఞానం బీఆర్ఎస్ ముఖ్యులకు ఉండదు కానీ..తలసాని ఎందుకో తొందరపడుతున్నారు. తన ఇంట్లో గ్రేటర్ ఎమ్మెల్యేలందర్నీ పిలిచి ఏం చేద్దామని అడిగారు. వారేం చెప్పారో కానీ.. మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెడతామంటున్నారు. ఈ ఏడాది చివరిలోనే గ్రేటర్ హైదరాబాద్ కు ఎన్నికలు జరగాల్సి ఉంది.