ఇవ్వాళ్ళ తెల్లవారుజామున 3.04 గంటలకు ఫ్రెంచ్ గయానాలోని కౌర్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన భారత ఉపగ్రహం జిశాట్-15 విజయవంతంగా నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టారు. ఈ జిశాట్-15 కమ్యూనికేషన్స్ ఉపగ్రహం దేశంలో బ్రాడ్ బ్యాండ్ సేవలకు, టీవీ చానళ్ళ ప్రసారం కోసం డీ.టిహెచ్. మరియు డి.ఎస్.ఎన్.జి. సేవలకు ఉపయోగపడుతుంది. 3164 కేజీల బరువు ఉండే ఈ ఉపగ్రహంలో మొత్తం 24 ట్రాన్స్ పాండర్లు, కెయు బ్యాండ్ పరికరాలను అమర్చారు. ఇది సుమారు 12 ఏళ్ల పాటు సేవలందిస్తుంది. దీనిని రూ.660 కోట్ల వ్యయంతో తయారు చేసారు. ఇటువంటి సేవలు అందించే విదేశీ ఉపగ్రహాలకు అయ్యే ఖర్చుతో దీనిని పోల్చి చూస్తే వాటిలో మూడవవంతు వ్యయంతోనే దీనిని నిర్మించడం విశేషం.