దేశంపై ఏకరూప పన్ను పిడుగు పడింది. జూలై ఒకటో తేదీనుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఏ వస్తువుకెంత పన్ను విధించాలనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కాశ్మీర్లో చల్లగా సమావేశమైంది. మొత్తం 1205 వస్తువుల్ని వివిధ రకాల పన్ను శ్లాబ్స్లోకి తెచ్చింది. 90శాతం వస్తువులపై నిర్ణయం తీసుకుంది. ఇంకా ఆరు వస్తువులు, సేవలపై పన్నును నిర్ణయించేందుకు శుక్రవారం కూడా జిఎస్టి కౌన్సిల్ సమావేశమైంది. నిత్యావసర వస్తువులపై పన్నును తగ్గించారు.
పన్ను ఉండని వస్తువులు
తాజా మాంసం, చికెన్, గుడ్లు, పాలు, పెరుగు, ప్రకృతి నుంచి సేకరించే తేనె, తాజా కూరగాయలు, పళ్ళు, పిండ్లు, ఉప్పు, రొట్టె, బిందీ, సింధూరం, స్టాంపు, జ్యుడిషియల్ పేపర్లు, ప్రచురించిన పుస్తకాలు, గాజలు, చేనేత వస్త్రాలు, వార్తా పత్రికలు
5 శాతం పన్నుపరిధిలోకి వచ్చేవి….
ఫిష్ పిల్లెట్, క్రీమ్, స్కిమ్డ్ మిల్క్ ఫౌడర్, బ్రాండెడ్ పన్నీర్, నిల్వ ఉంచిన కూరగాయలు, కాఫీ, టీ, స్పైసీస్, పిజ్జా బ్రెడ్, రస్క్, సగ్గుబియ్యం, కిరోసిన్, కోల్, మెడిసిన్స్, స్టెంట్, లైఫ్ బోట్స్
12 శాతం శ్లాబ్ లోకి వచ్చే వస్తువులు…
నిల్వ ఉంచిన మాంసం ఉత్పత్తులు, వెన్న, జున్ను, నెయ్యి, ప్యాక్డ్ డ్రై ఫ్రూట్స్, సాస్లు, పళ్ళ రసాలు, భుజియా, నమ్కిన్, ఆయుర్వేద ఔషధాలు, టూత్ ఫౌడర్, అగర్ బత్తి, రంగుల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, గొడుగు, కుట్టు మిషన్లు, సెల్ ఫోన్లు.
18 శాతం పరిధిలోకి వచ్చేవి…
ఈ పన్ను పరిధిలోకే ఎక్కువ వస్తువులను తెచ్చింది. పంచదార, పాస్తా, కార్న్ ఫ్లేక్స్, రొట్టెలు, కేకులు, జామ్స్, సూప్స్, ఐస్ క్రీమ్, ఇన్స్టెంట్ ఫుడ్ మిక్సెస్, మినరల్ వాటర్, టిష్యూలు, ఎన్వెలప్స్, నోట్ బుక్స్, స్టీల్ ప్రొడక్ట్స్, ప్రింటెడ్ సర్క్యూట్స్, కెమెరా, స్పీకర్స్, మానిటర్స్.
28 శాతం పన్నుపరిధిలోకి వచ్చేవి…
చూయింగ్ గమ్, మొలాసిస్, కోకో లేని చాకోలెట్లు, వేఫర్స్, పాన్ మసాలా, పెయింట్, పెర్ఫ్యూమ్, షేవింగ్ క్రీమ్స్, హెయిర్ షాంపు, డై, సన్ స్క్రీన్, వాల్ పేపర్, పింగాణి పాత్రలు, వాటర్ హీటర్, డిష్ వాషర్, బరువు కొలిచే యంత్రాలు, వాషింగ్ మిషన్, ఏటీఎంలు, వెండింగ్ మిషన్లు, వాక్యుమ్ క్లీనర్స్, షేవర్స్, హెయిర్ క్లిప్పర్స్, ఆటోమొబైల్స్, మోటార్ సైకిల్స్, వ్యక్తిగత అవసరాలకు వాడే ఎయిర్ క్రాఫ్ట్.