సీఎంగా ఉన్నప్పుడు విపత్తులొచ్చినా జగన్ రెడ్డి ఇంట్లో పడుకోవడమో.. పెళ్లిళ్లకు వెళ్లడమో చేశారని అదే కరెక్ట్ అని వాదించడానికి వైసీపీ ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. అసలు సీఎం వర బాధిత ప్రాంతాల్లో పర్యిటంచాల్సిన అవసరం ఏముందని వైసీపీ తరపున మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా ముందుకు వచ్చేశారు. సీఎం జేసీబీలు ఇక్కి తిరుగుతున్నారని ఇది పబ్లిసిటీ స్టంటేనన్నారు. వైసీపీలో పార్టీ ఆఫీసు నుంచి స్క్రిప్ట్ రానిదే ఎవరూ ప్రెస్ మీట్ పెట్టరు. కొద్ది రోజులుగా నోరు తెరవని అమర్నాత్ తో ఇప్పుడీ వాదన వినిపించడం వైసీపీ దివాలా కోరు తనానికి నిదర్శనంగా ఉందన్న సెటైర్లు టీడీపీ వైపు నుంచి పడుతున్నాయి.
ముఖ్యమంత్రి ఫీల్డ్ లో ఉండబట్టే అత్యంత తీవ్రమైన వరద నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. అధికారులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. చంద్రబాబు ఫీల్డ్్ లో ఉంటే పనులు ఎలా జరుగుతాయో.. ఎవరి పర్యవేక్షణా లేకపోతే ఎలా జరుగుతాయో అందరికీ తెలుసు. ఏడు పదులు దాటిన వయసులో చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడుతూంటే వైసీపీ నేతలు .. చంద్రరబాబు అసలు పని చేయాల్సిన అవసరం లేదన్న విచిత్ర వాదనలతో తెరపైకి వస్తున్నారు
చంద్రబాబుకు పబ్లిసిటీ అవసరమో కాదో కానీ.. జగన్ రెడ్డి చేసిన నిర్వాకాలను సమర్థించుకోవడానికి.. ఏ సీఎం కూడా పనులు చేయవద్దని.. ఫీల్డ్ లోకి వెళ్లకూడదని వాదించడానికి తమ తెలివి తేటలన్నిటినీ బయట పెట్టుకుంటూ ముందుకు వచ్చేస్తున్నారు. గతంలో జగన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడుతూ.. తాను విపత్తు ప్రాంతాలకు వెళ్తే అడ్డమవుతానని చెప్పుకొచ్చారు. ఆయన అడ్డం అవుతారేమో కానీ. చంద్రబాబు లాంటి వారు మాత్రం.. మాస్టర్ అడ్మినిస్ట్రేషన్ తో నష్టాన్ని వీలైనంత వరకూ తగ్గిస్తారు. అదే జరుగుతోంది. అది తట్టుకోలేకే వైసీపీ నేతల ఏడుపులన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.