పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన పెట్టుకునే సరికి వైసీపీ నేతలు ఫ్యూజులు ఎగిపోయాయి. మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జన అంటూ వైసీపీ నేతలు చేస్తున్న కార్యక్రమం రోజునే పవన్ కల్యాణ్ విశాఖ వెల్తున్నారు. తర్వాతి రోజు జనవాణి కార్యక్రమం పెట్టుకున్నారు. దీంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత తీసుకున్న గుడివాడ అమర్నాథ్కు .. పెద్ద చిక్కొచ్చి పడింది. తన గర్జనకు జనాలు వస్తారా రారా అనే టెన్షన్ ఒకటి అయితే.. పవన్ కల్యాణ్ పర్యటన కోసం జనసైనికులు.. భారీగా తరలి వస్తే.. వారి ముందు తన పరువు పోవడం ఖాయం. అందుకే గుడివాడ అమర్నాత్.. బెదిరింపులు ప్రారంభించారు.
పవన్ కల్యాణ్ విశాఖ రావొద్దని ఆయన అంటున్నారు. ఆయన విశాఖ వస్తే ప్రజలు నిలదీస్తారని అంటున్నారు. తన గర్జన కార్యక్రమం నుంచి దృష్టి మరల్చేందుకే ఆయన విశాఖ వస్తున్నారని ఏడ్చినంత ని చేస్తున్నారు. ఎప్పట్లాగే.. పవన్ కల్యాణ్ చంద్రబాబు పేకలో జోకర్ అంటూ వివాదాస్పద కామెంట్లూ చేశారు. అయితే అమర్నాథ్ తీరు చూసి జనం కూడా నవ్వుకుంటున్నారు. పవన్ కల్యాణ్ విశాఖ వస్తే ఎందుకంత తడుపుకుంటున్నారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే పవన్ కల్యాణ్.. మూడు రాజధానుల విషయంలో తన వాదన బలంగా వినపించారు. ఒక్క రాజధాని అమరావతికే మద్దతు ప్రకటించారు. నిజానికి వైసీపీ నేతలు అమర్నాథ్ తో సహా మొత్తం గతంలో మద్దతు ప్రకటించారు. వారు మాట మార్చారు. పవన్ మార్చలేదు అదే తేడా. అయినా సరే వీరంతా పవన్ కల్యాణ్‌పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూనే ఉన్నారు. చివరికి విశాఖ పర్యటనకు రావొద్దని బతిమాలుకునే పరిస్థితి వచ్చింది.