పోలీసు అధికారి అన్న క్రేజ్‌తో తన వద్దకు వచ్చిన వివాహితతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఎస్ఐనని తనను ఎవరూ ఏమీ చేయలేరని అనుకున్నాడు. అయితే.. వ్యక్తిగత జీవితాన్ని ఛిద్రం చేస్తుందని.. చివరికి.. తనను తాను చంపుకునే పరిస్థితికి తీసుకెళ్తుందని మాత్రం ఊహించలేకపోయాడు. గుడివాడ టూటౌన్ ఎస్ఐ విజయ్‌కుమార్ ఆత్మహత్యలో ఉన్న ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు. తప్పటడుగులు వేసి.. చివరికి ఈ బతుకు వద్దని ఆత్మహత్య చేసుకున్నాడు.
2017లో హనుమాన్ జంక్షన్ ఎస్ఐ రాసలీలలు అంటూ.. మీడియాలో హోరెత్తింది. ఆ ఎస్ఐ విజయ్ కుమార్. ఆయన సంబంధం పెట్టుకున్న బ్యూటీషియన్ భర్తనే… మొత్తం మీడియాకు లీక్ చేశాడు. సాక్ష్యంగా ఫోటోలు కూడా ఇచ్చాడు. దాంతో రచ్చ రచ్చ అయిపోయింది. అప్పటి నుండి ఆ బ్యూటీషియన్ భర్తను వదిలేసి ఎస్ఐతోనే ఉంటోంది. కానీ.. ఎస్ఐ ఆ వివాహితను మరో రకంగా చూశాడు. భార్యగా చూడలేదు. చూసుకోవాలని కూడా అనుకోలేదు. కానీ ఆమె… అలా అనుకోలేదు. అతను పెళ్లి చేసుకుంటాడనుకుంది.
అయితే విజయ్ కుమార్ 39ఏళ్ల వయసులో నాలుగు నెలల కిందట పెళ్లి చేసుకున్నాడు. కాపురానికి ఆ అమ్మాయిని తెచ్చుకుందామంటే.. అక్రమసంబంధం పెట్టుకున్న యువతి వేధిస్తోంది. మళ్లీ మీడియాలో రచ్చ చేస్తానని హెచ్చరిస్తోంది. మరో వైపు పెళ్లి చేసుకున్న కుటుంబం వైపు నుంచి ఒత్తిడి. ఈ క్రమంలో బ్యూటీషియన్ తనను పెళ్లి చేసుకోకపోతే.. చచ్చిపోతానని బెదిరించడం ప్రారంభించింది. ఈ బాధలన్నీ ఎందుకని విజయ్ కుమార్ ఉరేసుకున్నాడు.
మొత్తానికి పోలీసు హోదా తెచ్చిన కండ కావరంతో వ్యక్తిగత జీవితంలో చేసిన తప్పులు ఆయనను చుట్టుముట్టాయి. అదే ఆయనకు శాపం అయింది.