ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ప్రపంచవ్యాప్తంగా ఓ రకమైన ఇమేజ్ రావడానికి కారణం గుజరాత్ అల్లర్ల కేసులు. ఆయనపై వచ్చిన అభియోగాలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవలే ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత ఆయనపై ఆరోపణలు చేసిన వారిని అరెస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో సిట్ అసలు మోదీపై ఈ ఆరోపణలు ఎలా వచ్చాయో కనిపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అహ్మద్ పటేల్ మోదీని బ్యాడ్ చేయడానికి ఇలా కుట్ర చేశారని కనిపెట్టింది. ఈ విషయాన్ని కోర్టుకు అఫిడవిట్ రూపంలో చెప్పింది.
అప్పటి మోడీ సర్కార్‌ను బర్తరఫ్ చేసేందుకు అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకు తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్లు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారన్నారు. వీరికి అహ్మద్ పటేల్ ముఫ్ఫై లక్షలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ నుంచి అక్రమంగా డబ్బు తీసుకునేందుకు తీస్తా, శ్రీకుమార్‌లు కుట్రకు పాల్పడినట్లు సిట్ అఫిడివిట్లో పేర్కొంది. తీస్తా సెతల్వాద్‌ను ..మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్‌ను అహ్మదాబాద్ క్రైం బ్రాంచీ పోలీసులు అరెస్టు చేశారు.
అయితే 2020లో అహ్మద్ పటేల్ చనిపోయారు. సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఆయన సుదీర్ఘ కాలం ఉన్నారు. అయితే చనిపోయిన ఆయన ఎలాంటి వాదనలు వినిపించుకోలేరు . ఆయన బతికి ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలుచేయలేదు. కానీ ఇప్పుడు ఆయన చనిపోయిన సిట్ అహ్మద్ పటేల్‌ను ప్రధాన నిందితుడ్ని చేసింది. గుజరాత్ ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో సిట్ నివేదిక గుజరాత్లో హాట్ టాపిక్యింది. చనిపోయిన వారినీ వదలరా అని కాంగ్రెస్ పార్టీ ఈసడించుకుంటోంది.