విదేశాల్లో సూపర్ డిమాండ్ వున్న ఓ విగ్రహాన్ని ప్రమాదకరమైన ఒక మారుమూల పల్లెటూరి నుండి హీరో ఎలా దొంగిలించి తీసుకువచ్చాడనేది ‘గులేబకావళి’ చిత్రకథ. తమిళంలో ప్రభుదేవా, హన్సిక జంటగా నటించించిన చిత్రమిది. తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ రోజు ట్రయిలర్ విడుదల చేశారు. అందులో మొదటి ఇరవై సెకన్లు ప్రభుదేవా ఫైట్స్, డ్యాన్సు మూమెంట్స్‌తో నింపేశారు. తర్వాత కథ గురించి క్లారిటీ ఇచ్చారు. ఆపై వచ్చే ప్రతి పంచ్ డైలాగ్… సారీ కామెడీ డైలాగ్ తమిళ వాసనలు కొట్టింది. మధ్యలో వచ్చే సాంగ్ క్లిప్పింగ్స్ బాగున్నాయి. పాటలను బాగా ఖర్చుపెట్టి తీసినట్టున్నారు. ‘మా అబ్బాయి శ్రీనివాస్ అచ్చు నీలాగే వున్నాడు’ అని రేవతి చెప్పే డైలాగ్ ఒక్కటే ట్రయిలర్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. మాస్ ప్రేక్షకుల్లో ప్రభుదేవా ఇమేజ్, హన్సిక గ్లామర్ వల్ల సినిమాకు అడ్వాంటేజ్ వుండే అవకాశాలు వున్నాయి.