తెలుగునాట తయారవుతున్న తొంభై తొమ్మిది శాతం సినిమాలు ఒకే తరహాలో ఉంటాయి. అయితే విలన్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకునే హీరో కథ…..లేదంటే ఒక అమ్మాయి కోసం పడిచచ్చిపోతూ ఆ అమ్మాయిని, అమ్మాయి పేరెంట్స్‌ని కూడా ఏడిపించి ఫైనల్‌గా సుఖాంతమయ్యే ప్రేమకథలు. అంతకుమించి మన కథకులు ఆలోచించలేరు. ప్రతి శుక్రవారం మనల్ని పలకరించేవి అన్నీ ఇలాంటి రీసైక్లింగ్, రీమేక్ కథలే. అప్పుడప్పుడూ మాత్రం కొత్త కథలు వస్తూ ఉంటాయి. గల్ఫ్ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. గల్ఫ్ జీవితాలను అద్దంలో చూపించడంలో సినిమా సక్సెస్ అయింది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయింది. అలాగే గల్ఫ్‌కి వెళ్ళిన భర్తకుఇక్కడ ఉన్న తన గర్భిణి భార్యకు మధ్య వచ్చే సన్నివేశాలన్నీ కూడా మనసుకు హత్తుకుంటాయి.
గల్ఫ్ సినిమా క్లైమాక్స్ మాత్రం అద్భుతం అని చెప్పొచ్చు. ప్రేక్షకులందరికీ కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అన్నింటికీ మించి ఒక జ్ఙాపకంలా చాలా కాలం మనల్ని వెంటాడుతుంది. గల్ఫ్ జీవితాల కథల గురించి డైరెక్టర్ సునీల్ కుమార్ చేసిన అధ్యయనం మొత్తం సినిమాలో కనిపిస్తుంది. అర్జున్‌రెడ్డి, బాహుబలి లాంటి సినిమాలు మన దగ్గర చాలా చాలా చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. ఇంకా ఎన్నో చెత్త సినిమాలను ఉదాహరణగా చూపిస్తూ సినిమా ఇండస్ట్రీని విశ్లేషించే సోకాల్డ్ మేధావులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ‘గల్ఫ్’ కథలను చర్చించగలరా? ఇలాంటి విషయాలు చర్చనీయాంశం అయితే కాస్త ప్రభుత్వాల వైపు నుంచి కూడా స్పందన వచ్చే అవకాశం ఉంటుంది.