మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నేటి సమకాలిన రాజకీయాల్లో గుమ్మడి నర్సయ్య లాంటి రాజకీయ నేతలు చాలా అరుదుగా ఉంటారు. ఆయన సీఎంను కలిసేందుకు చాలా ప్రయత్నాలు చేసిన విఫలమయ్యారు. ఆయన ఓ సారి ఇంటి వద్దకు వెళ్లారు. కానీ రేవంత్ కలవకపోవడంతో విమర్శలు వచ్చాయి. అలాంటి రాజకీయ నేతల్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వచ్చాయి.
రేవంత్ రెడ్డి టీం చివరికి గుమ్మడి నర్సయ్యను గౌరవంగా సీఎం దగ్గరకు తీసుకెళ్లింది. ఆయన తాను ముఖ్యమంత్రిని ఏ పని మీద కలవాలనుకున్నారో దానికి సంబంధించి వినతిపత్రాలు ఇచ్చారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు.తప్పని సరిగా పరిష్కరిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు. ఎమ్మెల్యేగా తన జీతం కూడా కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చేసేవారు.
రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగిన తర్వాత ఆయన గెలవలేకపోయారు. కానీ ఆయనకు రాజకీయ పార్టీల నుంచి .. గౌరవం లభిస్తుంది. ఆయనను అందరూ అభిమానిస్తారు. ఆయన చేసిన విలువల రాజకీయం వల్ల ఆయన బయోపిక్ గా ఓ సినిమా కూడా తీస్తున్నట్లుగా చెబుతున్నారు.