రుద్రమదేవి తరవాత..`హిరణ్య కశ్యప` ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు గుణశేఖర్. దాదాపు 200 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. ఈ కథపై గుణశేఖర్ చాలా వర్క్ చేశాడు. అయితే రానా కాల్షీట్లు అందుబాటులో లేకపోవడం, లాక్ డౌన్… తదితర కారణాల వల్ల సెట్స్‌పైకి వెళ్లడం ఆలస్యమైంది. దాంతో.. `శాకుంతలమ్` పై ఫోకస్ చేశాడు గుణ. ఈ నేపథ్యంలో `హిరణ్య కశ్యప` ఆగిపోయిందేమో? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ సినిమాపై… గుణ ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశాడు. ఈసినిమా ఆగిపోలేదని, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుందని చెప్పుకొచ్చారు.
”హిరణ్య కశ్యప ఐదేళ్ల ప్రాజెక్టు. ఇప్పటికే మూడేళ్లు కష్టపడ్డాం. యానిమేషన్లో ఈ సినిమానిచూసుకున్నాం కూడా. ప్రొడక్షన్ కి 10 నెలలు సరిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్‌కి మరో యేడాది సమయం పడుతుంది. శాకుంతలమ్ పూర్తయిన వెంటనే.. హిరణ్య కశ్యపని సెట్స్‌పైకి తీసుకెళ్తాం. ఈసినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. వాళ్లతో టచ్‌లోనే ఉన్నా” అన్నాడు గుణ.