ఎన్నోసార్లు వాయిదా పడుతూ.. అపవాదాలు మోస్తూ వచ్చిన గుణశేఖర్ రుద్రమదేవి ఎట్టకేలకు రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్తుంది. అనుష్క లీడ్ రోల్లో చేసిన రుద్రమదేవి సినిమాను గుణశేఖర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక గోన గన్నారెడ్డి పాత్ర చేసిన అల్లు అర్జున్ అయితే అరుపులు పుట్టించాడన్నది వాస్తవం. సినిమాకు కావాల్సినంత మాస్ ఇమేజ్‌ని, ఫాలోయింగ్‌ని బన్నీ ద్వారా వచ్చేలా జాగ్రత్త పడ్డాడు గుణశేఖర్.
ఇక ఈ సినిమా రిలీజ్ అయిన నాటి నుండి మిక్స్డ్ టాక్ వస్తున్నా కలెక్షన్లు మాత్రం రోజు రోజుకి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందట. ఓవర్సీస్లో కూడా రుద్రమదేవి ఇప్పటికే హాఫ్ మిలియన్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుందట. దసరా హాలీడేస్ వచ్చిన సందర్భంగా సినిమా కలెక్షన్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ టాక్. దాదాపు మూడేళ్ల గుణశేఖర్ పడ్డ కష్టం ఫలించిందని చెప్పొచ్చు.
ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లో ఉన్న రుద్రమదేవి బ్రూస్ లీ రిలీజ్ అయ్యాక ఆ సినిమా టాక్ని బట్టి కూడా ఈ సినిమా కలెక్షన్స్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి తన కలల ప్రాజెక్ట్ గా గుణశేఖర్ రూపొందించిన రుద్రమదేవి మంచి టాక్ తో అభిమానులను అలరించడం పరిశ్రమకు మంచి రోజులొచ్చాయనే విషయాన్ని మరొక్కసారి వెళ్లడిస్తుంది.