పాకిస్తాన్ క్రికెటర్ వసీం అక్రంపై ఇద్దరు గుర్తు తెలిఉయని దుండగులు మోటార్ సైకిల్ పై వచ్చి ఆయన కారుపై కాల్పులు జరిపారు. ఆయన కరాచీలో ఉన్న జాతీయ క్రికెట్ స్టేడియం వద్దకు తన కారులో చేరుకోన్నప్పుడు ఆయనపై ఈ దాడి జరిగింది. మొదట బైక్ వచ్చిన ఇద్దరిలో ఒకడు ఆయన కారుపై కాలుపు జరిపాడు. ఆయన తన కారు దిగి తప్పించుకొని పారిపోతుంటే మరొకడు ఆయనపై కాల్పులు జరిపాడు. కానీ అదృష్టవశాత్తు వసీం అక్రం తప్పించుకొన్నారు. ఆ కాల్పుల శబ్దానికి చుట్టుపక్కల వారు రావడం చూసి ఆ దుండగులిద్దరూ తమ బైక్ పై అక్కడి నుంచి పారిపోయారు. తరువాత వసీం అక్రం స్థానికి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. ఆయన ఆ దుండగులు వచ్చిన బైక్ నెంబర్ నాట్ చేసుకొన్నారు. దానిని పోలీసులకి అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంతకు ముందు తనకు ఎవరి నుండి ఎటువంటి బెదిరింపు కాల్స్ రాలేదని తెలిపారు. వారు తనపై ఎందుకు దాడి చేసారో వారు ఎవరో తను ఊహించలేనని తెలిపారు. పోలీసులు కేసు నమోది చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు.