భారతీయ జనతా పార్టీ నేతలు విలువలు బయటకు చెబుతారు కానీ లోపల మాత్రం కల్ట్ ని అలాగే ఉంచుతారు. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు ఒకే సారి తమ తమ వీడియోల్ని పబ్లిక్‌లోకి వచ్చేలా చేసుకున్నారు. ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకున్నారా లేకపోతే యాధృచ్చికంగా జరిగాయా అన్నది వారికే తెలియాలి. కానీ ఇద్దరు నేతల పరువు అయితే పోయింది.
వారిలో ఒకరు గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు. ఆయన ఓ మహిళకు వీడియో కాల్ చేసి కలిసి మందు కొట్టడానికి ముహుర్తం పెట్టుకున్నారు. అదేమీ బలవంతం కాదు అవతల మహిళ అప్పటికే అలాంటి పార్టీలను బీజేపీ నేతతో కలిసి చేసుకుంది. మళ్లీ చేసుకుందాం రమ్మని పిలిచాడు. దానికి ఆమె రెడీ అనేసింది.ఆ వీడియో లీక్ అయింది. ఇక్కడ అసలు ట్విస్టేమిటంటే ఆమె గతంలో వైసీపీలో ఉండేది. అంబటి రాంబాబు అంతేనా.. ఇంకేమీ చేయదా అంటూ చేసిన ఆడియో సరసాలు ఈమెతోనని గాసిప్స్ గుప్పుమంటున్నాయి.
మరో గుంటూరు నేత.. రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న నేత నగ్న వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకుంటున్నారు. ఇది బీజేపీ హైకమాండ్ వరకూ వెళ్లింది. వెంటనే ఇద్దరి నేతల తీరుపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని పార్టీలోని ముఖ్యుల్ని ఆదేశించారు. రిపోర్టు వెళ్లగానే వీరిద్దరి పార్టీ పదవుల్ని తీసేస్తారని అంటున్నారు.