మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేద్దామని చిత్రబృందం ఫిక్సయ్యింది. అయితే అనుకొన్న సమయానికి ఈ సినిమా వస్తుందా, రాదా? అనే డౌట్ అందరిలోనూ ఉంది. దానికి బోలెడన్ని కారణాలు. సినిమా షూటింగ్ నత్త నడక నడుస్తోంది. చిత్రబృందంలోకి కొంతమంది కీలకమైన సభ్యులు వివిధ కారణాల వల్ల తప్పుకొన్నారు. తమన్ సరైన టైమ్‌కి పాటలు ఇవ్వడం లేదు. దాంతో.. షూటింగ్ అనుకొన్న సమయానికి పూర్తవుతుందా, సంక్రాంతికి వస్తుందా? అనే డౌట్లు మొదలయ్యాయి. వీటికి మహేష్ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమా సంక్రాంతికి వచ్చేస్తుందని చెప్పేశాడు. ఈరోజు హైదరాబాద్‌లో బిగ్ సీ 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో మహేష్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గుంటూరు కారం ప్రస్తావనకు వచ్చింది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నామని, అందరికీ నచ్చతుందని ఈ సందర్భంగా మహేష్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేశాడు. ఇదే సీజన్లో ప్రభాస్ `కల్కి` కూడా విడుదల కానుంది. సో.. ఈ సంక్రాంతికి మహేష్, ప్రభాస్‌ల మధ్య పోటీ చూడొచ్చన్నమాట.