శనివారం హైదరాబాద్ లో `గుంటూరు కారం` ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సివుంది. అక్కడే ట్రైలర్ విడుదల చేద్దామనుకొన్నారు. ఆఖరి నిమిషంలో పర్మిషన్లు ఇవ్వలేకపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. త్వరలోనే కొత్త డేట్, కొత్త వేదిక వెల్లడిస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు ఎలాంటి హడావుడీ లేకుండా ఈరోజు సాయింత్రం ట్రైలర్ బయటకు వదిలేస్తున్నారు. దాంతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుందా, ఉండదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చేయడానికి చిత్రబృందం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. ఈసారి గుంటూరులో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది? అనే దిశగా ఆలోచిస్తోంది. 9న గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగొచ్చు. ప్రస్తుతం అక్కడ పర్మిషన్ల కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేదిక కూడా దాదాపుగా ఖరారైపోయింది. అన్నీ ఓకే అనుకొన్న తరవాతే అఫీషియల్ గా ప్రకటిస్తారు. ప్రీ రిలీజ్ వేడుక మినహాయిస్తే… ఈ సినిమాకి ప్రమోషన్ ఈవెంట్స్ లేవు. ఓ గ్రూప్ ఇంటర్వ్యూ చేసి, అన్ని ఛానళ్లకూ ఇస్తారంతే! ఇప్పటికే ఈసినిమాపై విపరీతమైన బజ్ వచ్చింది. అందుకే ప్రమోషన్లు లేకపోయినా ఫర్వాలేదన్న ధీమాలో చిత్రబృందం ఉంది.